సౌదీ బస్సు ప్రమాదం వైరల్ వీడియో.. ఆరేళ్ల క్రితం నాటిది

- April 07, 2023 , by Maagulf
సౌదీ బస్సు ప్రమాదం వైరల్ వీడియో.. ఆరేళ్ల క్రితం నాటిది

సౌదీ: 2023 మార్చిలో సౌదీ అరేబియాలో జరిగిన ఘోరమైన బస్సు ప్రమాదానికి సంబంధించిన వీడియో అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. మంటల్లో చిక్కుకున్న వాహనం ఫుటేజీ ఉన్న ఆ వీడియోను ఇప్పటికే వేల మంది వీక్షించారు. అయితే, వాస్తవానికి ఈ వీడియో సౌదీ అరేబియాలో ఆరేళ్ల క్రితం అదే దారిలో జరిగిన ప్రమాదానికి సంబంధించినది అని అధికారులు తెలిపారు. "సౌదీ అరేబియాలో ఉమ్రా తీర్థయాత్ర చేయడానికి వెళుతున్న ప్రయాణికులతో నిండిన బస్సు ప్రమాదం" అని మార్చి 28న షేర్ చేసిన ఈ వీడియో హిందీ భాషాలో ఫేస్‌బుక్ పోస్ట్ లో చూపారు. 220,000 కంటే ఎక్కువ వీక్షణలను కలిగి ఉన్న ఈ వీడియో.. మంటల్లోని వాహనం, దట్టమైన పొగను చూపుతుంది. రమదాన్ మొదటి వారంలో దక్షిణ ప్రావిన్స్ అసిర్‌లోని అకాబా షార్‌లో మార్చి 27న పవిత్ర నగరమైన మక్కాకు ఉమ్రా యాత్రికులను తీసుకువెళుతున్న బస్సు వంతెనను ఢీకొనడంతో మంటలు చెలరేగడంతో 20 మంది మరణించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com