$2,000 దాటిన బంగారం ధరలతో తగ్గిన కొనుగోళ్లు..!
- April 07, 2023
యూఏఈ: బంగారం ధరలు దుబాయ్లో బుధవారం ఔన్సుకు $2,020 దాటాయి. ఇది బంగారు ఆభరణాల కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని బంగారు ఆభరణాల రిటైలర్లు చెబుతున్నారు. కాగా, ఈద్ అల్ ఫితర్, అక్షయ తృతీయ పండుగల సందర్భంగా అమ్మకాలు ఆశాజనకంగా ఉంటాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
బంగారం ధరలు శుక్రవారం ఉదయం 0.63 శాతం క్షీణించి ఔన్సు బంగారం ధర 2,007.79 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. యూఏఈలో 24K ధర గురువారం గ్రాముకు Dh242.75 వద్ద ముగిసింది. అయితే 22K, 21K మరియు 18K వరుసగా గ్రాముకు Dh224.75, Dh217.5 మరియు Dh186.5 వద్ద ట్రేడవుతున్నాయి.
మలబార్ గోల్డ్ & డైమండ్స్ అంతర్జాతీయ కార్యకలాపాల మేనేజింగ్ డైరెక్టర్ షామ్లాల్ అహమ్మద్ మాట్లాడుతూ..గత కొన్ని వారాలుగా మార్కెట్లో బంగారం ధర పెరిగిందని, దీంతో బంగారు ఆభరణాల విక్రయాలు తగ్గాయని తెలిపారు. " కొనుగోళ్లలో మందగమనం ఉంది. కానీ ఈద్, అక్షయ తృతీయ శుభ సందర్భంగా కొనుగోళ్లు తిరిగి పుంజుకుంటాయి " అని అహమ్మద్ అన్నారు.
తాజా వార్తలు
- సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
- డైరెక్టర్ వైవీఎస్ చౌదరి తల్లి ఇకలేరు
- 30న అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ 26వ స్నాతకోత్సవం
- హెచ్-1బీ వీసాల పై ట్రంప్ నిర్ణయం …
- ఆసియా కప్ ఫైనల్లో భారత్–పాకిస్థాన్ పోరు
- నేరగాళ్లను నేపాల్, ఉజ్బెకిస్తాన్ అధికారులకు అప్పగింత..!!
- కువైట్ లో 5,800 ట్రాఫిక్ వయోలేషన్స్, 153 మంది అరెస్టు..!!
- యాన్యువల్ నావల్ ఎక్సర్ సైజ్ సీ లయన్ ముగింపు..!!
- జూలైలో 30.4% పెరిగిన సౌదీ నాన్ ఆయిల్ ఎగుమతులు..!!
- సల్వా – ఈస్ట్ ఇండస్ట్రియల్ రోడ్ బ్రిడ్జ్ మూసివేత..!!