‘ఉస్తాద్ భగత్ సింగ్’.! ఊచకోత మొదలైందిగా.!
- April 07, 2023
హరీష్ శంకర్ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో రాబోతున్న మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. వెరీ లేటెస్ట్‌గా ఈ మూవీ సెట్స్ మీదికెళ్లింది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేశాడు హరీష్ శంకర్.
ఈ సినిమా కోసం పోలీస్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నాడన్న సంగతి తెలిసిందే. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి, ‘ఉస్తాద్ ఊచకోత మొదలైంది..’ అంటూ ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ క్రియేట్ చేశాడు హరీష్ శంకర్.
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తాను కమిట్ అయిన ప్రాజెక్టులన్నీ వరుసగా పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పటికే ‘వినోదయ సితం’ పూర్తి చేసేశాడు. ‘హరీ హర వీరమల్లు’ పనులు జరుగుతున్నాయ్. తదుపరి రేపో మాపో ‘ఓజీ’ కూడా మొదలెట్టేయనున్నాడట.
ఇక, ‘ఉస్తాద్’ విషయానికి వస్తే, కేవలం 40 రోజులు మాత్రమే పవన్ కళ్యాణ్ డేట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా షెడ్యూల్స్ పూర్తి చేసే పనిలో బిజీగా వుంది ‘ఉస్తాద్’ టీమ్.
తమిళ మూవీ ‘తెరి’ నుంచి మూలకథను తీసుకుని మార్పులు చేర్పులు చేసి ఈ సినిమాని చెక్కబోతున్నాడు హరీష్ శంకర్.
తాజా వార్తలు
- తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల GO విడుదల..
- కనకదుర్గ ఆలయానికి నూతన పాలకమండలి..
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం
- ఇ-కార్ రేసు కేసులో ఇద్దరు ఐఎఎస్ఐ పై ఎసిబి విచారణ
- జైల్లో గ్యాంగ్‌వార్ 17 మంది ఖైదీల మృతి
- రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!