అయ్యో పాపం.! ‘మీటర్’ హీరోకి కమర్షియల్ షాక్ ఇచ్చారే.!
- April 08, 2023
కిరణ్ అబ్బవరం.. ఈ పేరు ఇప్పుడు యూత్ ఐకాన్ అయిపోయిందంటే అతిశయోక్తి కాదేమో. హిట్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా ఈ కుర్ర హీరో వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. మొన్నీ మధ్యనే గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌లో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమా చేశాడు. ఒకింత పాజిటివ్ టాక్‌తో ఈ సినిమా ఫర్వాలేదనిపించింది.
ఈ ఊపులోనే మరో కొత్త సినిమా రిలీజ్ చేసేశాడు మనోడు. మాస్ రాజా రవితేజతో పోటీగా ‘మీటర్’ అనే సినిమాతో రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కిరణ్ అబ్బవరం.
కమర్షియల్‌గా ఈ సినిమా కిరణ్ అబ్బవరం ఇమేజ్‌ని నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్తుందని అంచనా వేశారు. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా చేశారు. అయితే, సీను రివర్స్ అయ్యింది.
ఫస్ట్ డే టాకే వీక్‌గా వచ్చేసరికి ఈ సినిమా ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కావడం కూడా కష్టమే అంటున్నారు. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సక్సెస్ భ్రమలో కూడా ‘మీటర్’ కొట్టుకుపోయేలా కనిపించడం లేదు. కమర్షియల్ స్టాండర్డ్ అనుకుంటే, ‘మీటర్’తో ఫేటే మారిపోయేలా వుంది కిరణ్ అబ్బవరానికి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







