మెగా రాకుమారుడి డబుల్ యాక్షన్ ధమాకా.!
- April 08, 2023
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మొదట్నుంచీ తాను ఎంచుకునే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటాడు. కంటెంట్ రిచ్ సినిమాలకే ఎక్కువ ప్రాథాన్యత ఇస్తుంటాడు.
అందులో భాగంగానే ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘గాంఢీవ ధారి అర్జున’ సినిమా చేస్తున్నాడు వరుణ్ తేజ్. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఇదో డిఫరెంట్ యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ అని తెలుస్తోంది.
దీంతో పాటూ మరో యాక్షన్ మూవీలోనూ వరుణ్ తేజ్ నటిస్తున్నాడు. ఈ సినిమాకి శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకుడు. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
గగన తలంలో హీరో చేసే యాక్షన్ ఘట్టాలు అబ్బుర పరిచేలా వుంటాయని అంటున్నారు. హాలీవుడ్ రేంజ్లో ఈ యాక్షన్ ఘట్లాలను డిజైన్ చేశారట. మానుషి చిల్లర్ హీరోయిన్గా నటిస్తోంది ఈ సినిమాలో. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ పాత్రలో చాలా హుందాగా, కొత్తగా కనిపించబోతున్నాడు మెగా రాకుమారుడు వరుణ్ తేజ్.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







