భారీ వర్షాల కారణంగా విరిగిపడ్డ కొండచరియలు
- April 10, 2023
మస్కట్: భారీ వర్షాల కారణంగా మస్కట్ గవర్నరేట్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో రెండు వాహనాలు దెబ్బతినగా.. ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. మస్కట్ గవర్నరేట్‌లోని విలాయత్ ఆఫ్ అల్-అమెరత్లో భారీ వర్షపాతం కారణంగా అల్-అటకియా స్ట్రీట్‌లోని అల్-అమెరత్-ఖురయ్యత్ రహదారిపై కొండచరియలు కూలి ట్రాఫిక్ ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) తెలిపింది. ఏప్రిల్ 7 నుంచి ఒమన్ సుల్తానేట్ లోని ధోఫర్, అల్ వుస్తా, సౌత్, నార్త్ అల్ షర్కియా, మస్కట్, అల్ దహిరా, అల్ దఖిలియా గవర్నరేట్లలో ఉరుములు, గాలులు, వడగళ్లతో కూడిన వర్షాలు పడుతున్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







