2 మిలియన్ దిర్హామ్ విలువైన నకిలీ వస్తువులు రీసైకిల్
- April 10, 2023
అబుధాబి: 2022,2023 మొదటి త్రైమాసికంలో అబుధాబి కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న Dh2 మిలియన్ల విలువైన అంతర్జాతీయ ట్రేడ్‌మార్క్‌ల 578 నకిలీ వస్తువులను రీసైకిల్ చేశారు. రీసైకిల్ చేసిన వాటిల్లో వైర్డు, వైర్లెస్ హెడ్ఫోన్ల వంటి అనేక స్మార్ట్ పరికరాలతో పాటు లేదర్ బ్యాగులు, బట్టలు, గడియారాలు, బెల్ట్‌లు, స్పోర్ట్స్ క్లాత్స్, లేదర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. రీసైక్లింగ్ కార్యకలాపాలలో నైపుణ్యం కలిగిన ష్రెడెక్స్ కంపెనీ, సంబంధిత ట్రేడ్‌మార్క్ యజమానుల ప్రతినిధుల సమక్షంలో అబుదాబి ఎయిర్పోర్ట్ కస్టమ్స్ సెంటర్ లాజిస్టిక్స్ జోన్లో పర్యావరణ, చట్టపరమైన అవసరాలను పూర్తి చేసిన తర్వాత రీసైకిల్ చేయలేని నకిలీ వస్తువులు నాశనం చేశారు. అబుధాబి కస్టమ్స్‌లోని సపోర్ట్ సర్వీసెస్ సెక్టార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫహెద్ గరీబ్ అల్షమ్సీ మాట్లాడుతూ.. మేధో సంపత్తి హక్కుల రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తామని తెలిపారు. నకిలీ వస్తువులను అడ్డుకోవడం ద్వారా సమాజాన్ని, ఆర్థిక వ్యవస్థలను రక్షించడానికి అబుధాబి కస్టమ్స్ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అధునాతన సాంకేతికతలతో తనిఖీ సామర్థ్యాలను మెరుగుపరచడం ద్వారా మార్కెట్లకు కల్తీ వస్తువుల అక్రమ రవాణాను నిరోధించే ప్రయత్నాలను తీవ్రతరం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పర్యావరణాన్ని సంరక్షించడానికి నకిలీ వస్తువులను రీసైక్లింగ్ చేయడం ద్వారా యూఏఈలో వర్తించే పర్యావరణ పరిరక్షణ చట్టాలు, నకిలీ వస్తువుల ఉపయోగించడం ద్వారా జరిగే నష్టాలపై అవగాహన కల్పిస్తుందన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







