పవన్ కళ్యాణ్ ఇంకోటి.! అబ్బే.! తగ్గేదేలే.!
- April 10, 2023
ఇటీవల మాస్ రాజా రవితేజతో ‘రావణాసుర’ సినిమా తెరకెక్కించిన సుధీర్ వర్మ, పవన్ కళ్యాణ్‌తో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ స్టోరీ లైన్ చెప్పారట. దాన్ని డెవలప్ చేసే బాధ్యత సుధీర్ వర్మకు అప్పగించినట్లు టాక్ వినిపిస్తోంది. మాటలు, స్క్రీన్‌ప్లే మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్దేనట.
కథ మాత్రం సుధీర్ వర్మ సిద్ధం చేయనున్నారట. ఇందులో నిజమెంతో తెలీదు కానీ, ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేతిలో నాలుగు ప్రాజెక్టులున్నాయ్.
అందులో ‘వినోదయసితమ్’ పూర్తయిపోయింది. హరీష్ శంకర్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇటీవలే సెట్స్ మీదికి వెళ్లింది. వచ్చే నెల్లో సుజిత్ ‘ఓజీ’ రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుంది.
ఈ లోపు సుధీర్ వర్మ ప్రాజెక్టు.. నిజంగానే ఈ ప్రాజెక్టుకు పవన్ కళ్యాణ్ సై అన్నారా.? పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- కువైట్ అమీర్‌ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్‌పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్‌ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







