చరణ్ ఔట్ ఎన్టీయార్ ఇన్.! అల్లు అరవింద్ డ్రీమ్ ప్రాజెక్ట్.!
- April 10, 2023
రామ్ చరణ్, అల్లు అర్జున్‌తో ఓ సినిమా రూపొందించాలని అల్లు అరవింద్ గతంలో తన మనసులోని మాట బయట పెట్టిన సంగతి తెలిసిందే. ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా అభివర్ణించారు అల్లు అరవింద్.
అయితే, అందుకు తగ్గ సమయం రావడం లేదనీ, అందుకోసం ఎదురు చూస్తున్నట్లుగా ఆయన తెలిపారు. అలాగే, ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఓ టైటిల్ కూడా ఆయన రిజిస్టర్ చేయించినట్లు తెలిపారు.
తాజాగా ఈ కాంబినేషన్ నుంచి రామ్ చరణ్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. అంటే, స్వతహాగా కాదండోయ్. ప్రాజెక్ట్ ఇదే. కానీ, రామ్ చరణ్ ప్లేస్‌లో ఎన్టీయార్ పేరు వినిపిస్తోంది.
బన్నీ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్, ఎన్టీయార్ మధ్య బావా బావా అనే ఓ సరదా సంభాషణ జరిగింది. ఈ సంభాషణే తాజా ప్రాజెక్ట్ అంకురార్పణకు కారణమైంది. ఇది జస్ట్ గాసిప్ మాత్రమే సుమా.! వివరాలు తేలేవరకూ వెయిట్ చేయాల్సిందే.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







