రవికుమార్ పనస నిర్మాతగా తొలి చిత్రం ప్రారంభం
- April 10, 2023
హైదరాబాద్: ఏషియన్ ఫిలిమ్స్ నారాయణ దాస్ నారంగ్ సమర్పణలో ఒక పిరియడ్ ఫిల్మ్ రూపొందుతోంది.రవి పనస ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్:1 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ వ్యాపారవేత్త రవి కుమార్ పనస అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్నారు.
మసూద లాంటి సూపర్ హిట్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా దగ్గరైన తిరువీర్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. విభిన్న కథాంశంతో నూతన దర్శకుడు జి.జి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రాన్ని ప్రస్తుతాన్ని "ప్రొడక్షన్ నెంబర్ 1" గా పరిగణిస్తున్నారు.
ఎక్కడా రాజీ పడిన నిర్మాణ విలువలతో, మునుపెన్నడూ చూడని కథాంశంతో, ప్రతిభావంతులైన నటులతో, దర్శకుడితో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులని అలరిస్తుందని రవికుమార్ పనస అన్నారు.ఏషియన్ ఫిలింస్ సమర్పణలో ఈ సినిమాని తీస్తుండడం మరింత సంతోషదాయకమన్నారు. ఇది ఒక పీరియడ్ యాక్షన్ డ్రామా జానర్ లో రూపొందుతోందని తెలిపారు రవికుమార్ పనస.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







