షేక్ హమద్ బిన్ సుల్తాన్ అల్-థానీ మస్జీద్ ప్రారంభం
- April 11, 2023
దోహా: ఉమ్ అల్ అమాద్ ప్రాంతంలో షేక్ హమద్ బిన్ సుల్తాన్ బిన్ జాసిమ్ బిన్ మహ్మద్ అల్-థానీ మస్జీదును అవ్కాఫ్, ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. 2,267 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించబడిన ఈ మస్జీదులో దాదాపు 1,150 మంది ఒకే సారి ప్రార్థనలు చేయవచ్చు. ఈ ప్రారంభోత్సవంలో దావ్హా(Da'wah), మస్జీదు వ్యవహారాల మంత్రిత్వ శాఖ అవ్కాఫ్, ఇస్లామిక్ అఫైర్స్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ హెచ్‌ఈ మహ్మద్ బిన్ హమద్ అల్ కువారి, షేక్ అహ్మద్ బిన్ హమద్ బిన్ సుల్తాన్ అల్-థానీ, మంత్రిత్వ శాఖ ఇంజనీర్ ఖలీద్ ఇంజినీరింగ్ వ్యవహారాల విభాగం డైరెక్టర్ అల్ అబ్దుల్ జబ్బార్ పాల్గొన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాలలో జనాభా పెరుగుదలకు అనుగుణంగా అనేక మస్జీదులను విస్తరిస్తున్నామని, ఇందులో భాగంగానే అల్-థానీ మస్జీదును కూల్చివేసి పునర్నిర్మించామని మంత్రిత్వ శాఖ సహాయ అండర్ సెక్రటరీ వివరించారు. కొత్త మస్జీదులో 650 మంది ఆరాధకులు ఉండగలిగే ప్రధాన ప్రార్థన మందిరం, 450 మంది ఆరాధకులు ఉండగలిగే మెజ్జనైన్ అంతస్తులో ఒక ప్రార్థన మందిరం, 60 మంది ఆరాధకులు ఉండగలిగే మహిళల హాలు, 17 కార్ల కోసం పార్కింగ్, అనేక పార్కింగ్ స్థలాలు ఉన్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్‌ప్రెస్‌వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్‌కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్‌ఫామ్‌కు నష్టం: కువైట్







