ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులకు ముందస్తు జీతాలు: షేక్ మొహమ్మద్

- April 11, 2023 , by Maagulf
ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులకు ముందస్తు జీతాలు: షేక్ మొహమ్మద్

యూఏఈ: యూఏఈ ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులు, నాన్ ప్రాఫిట్ సంస్థల ఉద్యోగులు తమ ఏప్రిల్ నెల వేతనాలను ఏప్రిల్ 17న అందుకోనున్నారు. ఈ మేరకు యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశాలు జారీ చేశారు. ఈద్ సెలవులకు కుటుంబాలు షాపింగ్ చేయడానికి.. సిద్ధం కావడానికి ఈ నిర్ణయం మేలు చేయనుందని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. హిజ్రీ క్యాలెండర్‌లో రమదాన్ తర్వాత వచ్చే నెల అయిన షవ్వాల్ మొదటి తేదీన పవిత్ర మాసం తర్వాత జరుపుకునే ఈద్ అల్ ఫితర్ పండుగ 2023లో మొదటి లాంగ్ వీకెండ్ గా ఉండనుంది. ఇది ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 23 వరకు ఉంటుందని భావిస్తున్నారు. మార్చి 23న ఎమిరేట్స్‌లో పవిత్ర మాసం ప్రారంభమైంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com