కార్మిక చట్టం ఉల్లంఘన.. ఇళ్లపై దాడులు

- April 12, 2023 , by Maagulf
కార్మిక చట్టం ఉల్లంఘన.. ఇళ్లపై దాడులు

మస్కట్: కార్మిక చట్టాన్ని ఉల్లంఘించేవారిని అరికట్టేందుకు అల్ దఖిలియా గవర్నరేట్‌లోని పలు ఇళ్లపై కార్మిక మంత్రిత్వ శాఖ దాడులు చేసింది. అల్-దఖిలియా గవర్నరేట్‌లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ లేబర్‌లోని జాయింట్ ఇన్‌స్పెక్షన్ టీమ్ కార్యాలయం, అల్-దఖిలియా మున్సిపాలిటీ సహకారంతో, నిజ్వా రాష్ట్రంలోని కొన్ని ఇళ్లపై దాడి చేసినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ సందర్భంగా కార్మిక చట్టాన్ని ఉల్లంఘించి అనేక మంది ప్రవాస కార్మికులను అరెస్ట్ చేశామని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com