జీతాల సంక్షోభం..సమ్మెలోకి పీఐఏ పైలట్లు!

- April 13, 2023 , by Maagulf
జీతాల సంక్షోభం..సమ్మెలోకి పీఐఏ పైలట్లు!

యూఏఈ: పాకిస్తాన్ జాతీయ ఫ్లాగ్ క్యారియర్ అయిన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (PIA)లో  జీతాల సంక్షోభం తలెత్తింది. దీంతో పీఐఏ పైలట్లు తమ విధులను బహిష్కరించి.. సమ్మేలోకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు స్థానిక మీడియా ఔట్‌లెట్ ARY న్యూస్ నివేదించింది. నిధుల కొరత కారణంగా నెలల తరబడి తన ఉద్యోగులకు జీతాలు తరచూ ఆలస్యం అవుతున్నాయి. నగదు కొరత కారణంగా పే స్కేల్‌లు 5 నుండి 10 వరకు ఉన్న అధికారులకు .. సిబ్బంది, పైలట్‌లకు రమదాన్ నెలలో జీతాలు చెల్లింపులు జరుగలేదని  ఏఆర్వై తెలిపింది. పీఐఏకు రూ.400 బిలియన్లకు పైగా పన్ను అప్పులు ఉన్నాయని నివేదించింది.దీని కోసం ఇటీవల రూ.45 బిలియన్ల ప్రభుత్వ బెయిలౌట్‌ను కూడా కోరినట్లు తెలిపింది. ఇదిలా ఉండగా.. ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ (FBR) క్యారియర్ ఖాతాల నుండి రూ.14 బిలియన్లను తగ్గించడంతో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. పైగా వచ్చే వారంలోగా PIA అదనంగా రూ.1.7 బిలియన్ల పన్ను డబ్బును చెల్లించాలని డిమాండ్ చేసింది. కాగా, దీనిపై పీఐఏ  ప్రతినిధి స్పందిచారు. విధుల బహిష్కరణల కారణంగా విమాన కార్యకలాపాలను నిలిపివేయడానికి సంబంధించిన నివేదికలను ఖండించారు. పీఐఏ అధికారులకు ఇప్పటికే 1 నుంచి 4 వరకు వేతనాలు చెల్లించామని, 5 నుంచి 10 వరకు ఉన్న పే స్కేల్‌లలోని సిబ్బందికి మిగిలిన వారికి జీతాలను త్వరలో అందజేస్తామని ప్రతినిధి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com