షార్జాలో క్రిప్టో స్కామ్.. మిలియన్ దిర్హామ్‌లను కోల్పోయిన బాధితురాలు
- April 13, 2023
యూఏఈ: షార్జాలోని ఒక అరబ్ వ్యాపారవేత్త క్రిప్టో స్కామ్‌తో మిలియన్ దిర్హామ్‌లకు పైగా మోసపోయింది. 51 ఏళ్ల మిఠాయి వ్యాపార యజమాని, ఆరుగురు పిల్లల తల్లి అయిన సారా (పేరు మార్చబడింది) తన కొడుకు పెళ్లికి, ఇల్లు కొనడానికి ఆదా చేసిన డబ్బును క్రిప్టో స్కామ్ లో కోల్పోయింది. పోలీసుల రికార్డుల ప్రకారం.. 2022 మధ్యలో సారాకు సౌందర్య సాధానాలు కావాలని ఓ రాంగ్ వాట్సాప్ మేసేజ్ వచ్చింది. ఆ తర్వాత రాంగ్ మేసేజ్ వచ్చిందని.. మాటలు కలిపారు. తనను తాను హాంకాంగ్‌కు చెందిన కోకోగా పరిచయం చేసుకున్నది. త్వరలోనే ఇద్దరి మధ్య స్నేహం బలపడింది. ఈ క్రమంలో కోకో సారాకు క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ద్వారా డబ్బు సంపాదించడంలో సహాయం చేస్తున్న తన అత్త గురించి చెప్పింది.
దీంతో సారా అక్టోబర్ 2022లో కోకో సిఫార్సు చేసిన క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌లో $12,000 పెట్టుబడి పెట్టింది. ప్రారంభంలో, సారా కొంత లాభం రావడంతో.. 2023మార్చి నాటికి దాదాపు $200,000 (Dh734,000) పెట్టుబడి పెట్టింది. కాగా, తాను పెట్టుబడి పెట్టిన అమౌంట్ $400,000కి పెరిగాయని చూపించినప్పుడు సారా థ్రిల్‌గా ఉంది. తాను డబ్బును ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించినప్పుడు, పన్నుల రూపంలో $73,000 అడుగుతూ తనకు ఇమెయిల్ వచ్చిందని సారా చెప్పింది. కోకో సలహా మేరకు డబ్బును కట్టినట్టు సారా తెలిపింది. అయితే, కొన్ని రోజుల తర్వాత సదరు వెబ్సైట్ కనిపించకుండా పోయింది. కోకో కూడా అందుబాటులోకి రాలేదు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన సారా.. పోలీసులను ఆశ్రయించింది. స్కామర్లు తరచుగా తప్పు చేసినట్లు నటించడం ద్వారా సోషల్ మీడియా, డేటింగ్ యాప్‌లు, వాట్సాప్ లేదా టెక్స్ట్ సందేశాల ద్వారా పరిచయాన్ని ప్రారంభించి ఆపై మోసం చేస్తారని, అపరిచిత వ్యక్తుల మెసేజ్ లు, లింకులకు స్పందించవద్దని అధికారులు సూచిస్తున్నారు.
ఇటీవల దుబాయ్‌లోని ఒక మాజీ IT డైరెక్టర్ క్రిప్టో స్కామ్‌లో Dh650,000 కోల్పోగా.. ఒక అజ్మాన్ నివాసి కూడా ఇదే విధమైన కుంభకోణంలో $47,000 ఎలా పోగొట్టుకున్నాడు. సైబర్‌సెక్యూరిటీ వెంచర్స్ ప్రకారం.. సైబర్‌క్రైమ్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా సంవత్సరానికి $10,5 ట్రిలియన్లను బాధితులు మోసపోతున్నారు. ఖర్చవుతుందని అంచనా. సైబర్‌టాక్‌లు అణ్వాయుధాల కంటే మానవాళికి పెద్ద ముప్పు అని బిలియనీర్ వ్యాపారవేత్త వారెన్ బఫెట్ పేర్కొనడం సమస్య తీవ్రతకు అద్దంపడుతుంది.
తాజా వార్తలు
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!
- అనుమతి లేకుండా వ్యక్తిగత డేటా బహిర్గతం..తీవ్రమైన నేరం..!!
- అబుదాబి-దుబాయ్ E11లో EV మెగాహబ్..!!
- 1,197 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- ముసందంలో డిస్కవరీ డైవింగ్ సెంటర్.. టూరిజానికి బూస్ట్..!!
- 2025లో కుటుంబం,బాలల రక్షణకు 4,400 రిపొర్టులు..!!
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం







