యూఏఈ లో భారీ వర్షాలు.. వాహనదారులకు హెచ్చరికలు జారీ
- April 14, 2023
యూఏఈ: వివిధ ఎమిరేట్‌లలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ట్రాఫిక్ నియమాలను పాటించాలని, సురక్షితంగా నడపాలని వాహనదారులను హెచ్చరిస్తున్నారు. దుబాయ్, అల్ ఐన్, రస్ అల్ ఖైమాతో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైందని జాతీయ వాతావరణ కేంద్రం (NCM) తెలిపింది. మరొవైపు MET డిపార్ట్‌మెంట్ హట్టా (దుబాయ్), ఖట్ (RAK) లలో భారీ వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించాయి. ప్రమాదకర వాతావరణ పరిస్థితుల నివాసితులను హెచ్చరిస్తూ ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో రెయిన్ అలర్ట్‌లకు సంబంధించి క్లౌడ్-సీడింగ్ హ్యాష్‌ట్యాగ్ వైరల్ అవుతోంది. అబుధాబి, ఫుజైరా, షార్జా ప్రాంతాల్లో మోస్తరు నుండి తేలికపాటి వర్షం నమోదు కాగా.. అల్ ఫౌహ్ - అల్ ఐన్, అల్ హియా - AL ఐన్, కల్బా – షార్జా, అల్ ఐన్ - దుబాయ్ రోడ్, అల్ మునియాయ్ - రాస్ అల్ ఖైమా, హట్టా – దుబాయ్, నహిల్ - అల్ ఐన్, అల్ బిద్య, అల్ , రయ్యా – ఫుజైరా, ఖట్ - రస్ అల్ ఖైమా, అల్ అజ్బాన్ – అబుదాబి, అల్ హలాహ్/ వాడి అబాదిలా/ దిబ్బా – ఫుజైరా, అల్ దిగ్దాగా, అల్ హమ్రానియా - రాస్ అల్ ఖైమా, సీహ్ షుయబ్ - అబుధాబి తదితర ప్రాంతాల్లో భారీ నుండి తేలికపాటి వర్షాలు కురిసాయి. NCM ప్రకారం, ఈ అస్థిర వాతావరణం ఏప్రిల్ 14 సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. దీని వలన కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా పశ్చిమాన దుమ్ము, ఇసుక తుఫాన్ లు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం







