రియాద్‌ బస్సు ప్రమాదంలో ఒకరు మృతి.. పలువురికి గాయాలు

- April 14, 2023 , by Maagulf
రియాద్‌ బస్సు ప్రమాదంలో ఒకరు మృతి.. పలువురికి గాయాలు

రియాద్: రియాద్ నగరంలో బస్సు వంతెన పై నుండి పడిపోయిన ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను రెస్క్యూ వర్కర్లు ఆసుపత్రికి తరలించినట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ గురువారం  తెలిపింది. సివిల్ డిఫెన్స్, జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ సహకారంతో సహాయక చర్యలను చేపట్టింది. ఈ ఘటనకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. వంతెనలకు ఇరువైపులా ఉన్న ఇనుప కంచెలను కాంక్రీట్‌తో ఏర్పాటు చేయాలని పలువురు నెటిజన్లు పిలుపునిచ్చారు. ఇలాంటి ప్రాణాంతక ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు బస్సు డ్రైవర్లకు శిక్షణ ఇవ్వడంతోపాటు వాహనాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సిన అవసరం కూడా ఉందని వారు అభిప్రాయపడ్డారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com