మార్చిలో 25 శాతం పెరిగిన విమాన ప్రయాణీకులు

- April 14, 2023 , by Maagulf
మార్చిలో 25 శాతం పెరిగిన విమాన ప్రయాణీకులు

ఖతార్: 2023 మార్చి నెలలో ఖతార్ లో విమాన ప్రయాణికుల సంఖ్య 25 శాతం పెరిగిందని ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (QCAA) విడుదల చేసిన ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ స్టాటిస్టిక్స్ వెల్లడించింది. QCAA  నివేదిక ప్రకారం, ఈ సంవత్సరం మార్చిలో మొత్తం 3,516,939 విమాన ప్రయాణీకులు ప్రయాణించారు. ఇది 2022లో అదే కాలంలో నమోదైన 2,813,043తో పోలిస్తే 25 శాతం పెరుగుదలను నమోదు చేసింది.  మార్చి 2023లో విమానాల ప్లోటింగ్ 12.9 శాతం వృద్ధిని నమోదు చేసిందని, 2022లో  మొత్తం 19,561 విమానాలు(2021లో 17,320) నమోదయ్యాయని పేర్కొంది. కాగా, కార్గో, మెయిల్ 206,276 టన్నులు నమోదు కాగా.. గతేడాది (2022లో  217,676 టన్నులు) 5.2 శాతం తగ్గుదల నమోదైంది.  మార్చి నెలలో హమద్, దోహా అంతర్జాతీయ విమానాశ్రయాలలో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉందని నివేదిక తెలిపింది. FIFA ప్రపంచ కప్ 2022 సందర్భంగా ఖతార్ ని 1.4 మిలియన్ల మంది సందర్శించారు. 2023లో ప్రముఖ గ్లోబల్ టూరిస్ట్ డెస్టినేషన్‌గా ఖతార్ స్థానాన్ని బలోపేతం చేయడం, 2030 నాటికి ఏటా 6 మిలియన్ల మంది సందర్శకులను ఆకర్షించడం, స్థూల దేశీయోత్పత్తి (GDP)కి పర్యాటక రంగం సహకారాన్ని 12 శాతానికి పెంచడం వంటి కార్యక్రమాలను ఖతార్ టూరిజం మంత్రిత్వ శాఖ ప్రకటించింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com