125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
- April 14, 2023
హైదరాబాద్: హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద రాజ్యాంగ రూపశిల్పి భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మనుమడు, మాజీ ఎంపీ ప్రకాశ్ అంబేద్కర్ కూడా పాల్గొన్నారు.
అంతకు ముందు అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహంపై హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిపించారు. బౌద్ధమత ప్రార్థనలు చేశారు. బౌద్ధ గురువులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతన సచివాలయం, ఎన్టీఆర్ ఘాట్, పీవీ మార్గ్ ప్రాంతాలు జన సందోహంగా మారాయి. అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమానికి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఇది దేశంలోని అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం. ట్యాంక్ బండ్ వద్ద 11 ఎకరాల 80 సెంట్ల స్థలంలో ఇక్కడ స్మృతివనాన్ని అభివృద్ధి చేశారు. 2016లో అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2018 డీపీఆర్ కోసం ఉత్తర్వులు జారీ చేసి, 2020, సెప్టెంబర్ 16న రూ.146.50 కోట్ల మంజూరు చేసింది ప్రభుత్వం. 50 అడుగుల ఎత్తైన పార్లమెంట్ నమూనా పీఠంపై అంబేద్కర్ విగ్రహం ఉంటుంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







