సరికొత్త లీగ్ ఏర్పాటు దిశగా సౌదీ అరేబియా
- April 14, 2023
ముంబై: టెస్టులు, వన్డేలతో పోలిస్తే టీ20లకు ఆదరణ ఎక్కువగా ఉంది అన్నది కాదనలేని వాస్తవం. బౌండరీల వర్షంలో తడిసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల సంఖ్య ప్రతియేడు పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ప్రాంఛైజీ క్రికెట్ లీగ్‌లకు ఆదరణ పెరుగుతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) విజయవంతం కావడంతో బంగ్లాదేశ్, వెస్టిండీస్, పాకిస్తాన్ వంటి దేశాల్లోనూ ప్రాంఛైజీ లీగ్ ప్రారంభం అయ్యాయి. అయితే.. ఎన్ని లీగులు ప్రారంభమైనప్పటికీ ఐపీఎల్‌కు ఉన్న ఆదరణ ఏ ప్రాంచైజీ క్రికెట్ లీగ్‌కు లేదు.
ఐపీఎల్‌లో ఆటగాళ్ల పై కాసుల వర్షం కురుస్తుంటుంది. ఒక్కసారి ఐపీఎల్ ఆడితే చాలు రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావొచ్చు. దీంతో ఐపీఎల్‌లో ఆడేందుకు అంతర్జాతీయ ఆటగాళ్లు ఇష్టపడుతుంటారు. అయితే.. ఐపీఎల్‌ను తలదన్నేలా ఓ టీ20 లీగ్‌ను నిర్వహించేందుకు సౌదీ అరేబియా ప్లాన్ చేస్తోంది. ఇందు కోసం ఇప్పటికే ఐసీసీతో సంప్రదింపులు జరిపింది. అంతేకాకుండా గత ఏడాదిగా భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI), ఐపీఎల్ ఫ్రాంచైజీలతో చర్చలు జరుపుతోంది. ఈ మెగా లీగ్‌లో భారత క్రికెటర్లను కూడా ఆడించాలన్నది సౌదీ ప్లాన్.
బీసీసీఐ ప్రస్తుత రూల్స్ ప్రకారం భారత క్రికెటర్లు ఐపీఎల్ మినహా ఇతర దేశాలు నిర్వహించే ఏ రకమైన లీగుల్లో పాల్గొనేందుకు అనుమతి లేదు. ఒకవేళ ఆడాలని అనుకుంటే బీసీసీఐతో అన్ని సంబంధాలను ముగించాల్సి ఉంటుంది. సౌదీ అభ్యర్థనను గనుక బీసీసీఐ అంగీకరిస్తే భారత క్రికెటర్లు కొత్త లీగులో ఆడే అవకాశం ఉంది. అప్పుడు బీసీసీఐ తన నిబంధనలను మార్చాల్సి ఉంటుంది.
సౌదీ అరేబియా గత కొంతకాలంగా క్రీడలపై పెట్టుబడులు పెడుతోంది. ఫార్ములా-1, గోల్ఫ్ లో ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టి ప్రారంభించింది. ఈ క్రమంలో క్రికెట్‌పై ప్రస్తుతం దృష్టి పెట్టింది. సౌదీని ప్రపంచ క్రికెట్‌కు గమ్యస్థానంగా మార్చడమే తమ లక్ష్యమని సౌదీ అరేబియా క్రికెట్ ఫెడరేషన్ చైర్మన్ ప్రిన్స్ సౌద్ బిన్ మిషల్ అల్-సౌద్ గతంలో చెప్పారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







