ఏప్రిల్ 17 నుండి ఫ్లోటింగ్ బ్రిడ్జి 5 వారాల పాటు మూసివేత
- April 15, 2023
దుబాయ్: ప్రధాన నిర్వహణ పనుల నేపథ్యంలో ఏప్రిల్ 17 నుండి 5 వారాల పాటు ఫ్లోటింగ్ బ్రిడ్జ్‌ని మూసివేయనున్నట్లు దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. ట్రాఫిక్ సజావుగా సాగేందుకు, ప్రత్యామ్నాయ రోడ్లు, క్రాసింగ్లకు ట్రాఫిక్‌ను మళ్లించడానికి అధికార యంత్రాంగం రూపొందించిన ఒక సమగ్ర ప్రణాళికను విడుదల చేసింది. షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్, ఎమిరేట్స్ రోడ్ వంటి ప్రధాన రహదారులతో పాటు అల్ ఇత్తిహాద్ స్ట్రీట్ నుండి వచ్చే వాహనదారుల కోసం RTA అల్ మమ్జార్ స్ట్రీట్ ను తెరువనుంది.
షార్జా నుండి అల్ ఇత్తిహాద్ స్ట్రీట్: కైరో, అల్ ఖలీజ్ స్ట్రీట్ల ద్వారా ఇన్ఫినిటీ బ్రిడ్జికి వెళ్లి.. (గతంలో బస్సులు, టాక్సీలకు మాత్రమే పరిమితం) అల్ మమ్జార్ బయటకు వెళ్లవచ్చు.
డీరా నుండి బుర్ దుబాయ్ : ఇన్ఫినిటీ బ్రిడ్జిని ఉపయోగించవచ్చు.
అల్ ఇత్తిహాద్ రోడ్ ద్వారా షార్జా నుండి బుర్ దుబాయ్‌కి : కైరో, అల్ ఖలీజ్ స్ట్రీట్స్, అలాగే అల్ గర్హౌద్ బ్రిడ్జ్ లేదా అల్ మక్తూమ్ బ్రిడ్జ్ ద్వారా ఇన్ఫినిటీ బ్రిడ్జిని ఉపయోగించవచ్చు.
ఖలీద్ బిన్ అల్ వలీద్ స్ట్రీట్ ద్వారా బుర్ దుబాయ్ నుండి దీరాకు : అల్ మక్తూమ్ వంతెన, ఇన్ఫినిటీ బ్రిడ్జిని ఉపయోగించవచ్చు.
ఉమ్ హురైర్ రోడ్ ద్వారా బుర్ దుబాయ్ నుండి డీరాకు: అల్ మక్తూమ్ వంతెనను ఉపయోగించవచ్చు.
షేక్ జాయెద్ రోడ్ ద్వారా బుర్ దుబాయ్ నుండి దీరాకు : అల్ గర్హౌద్ బ్రిడ్జ్, అల్ మక్తూమ్ బ్రిడ్జ్, ఇన్ఫినిటీ బ్రిడ్జ్, బిజినెస్ బే క్రాసింగ్‌ని ఉపయోగించవచ్చు.
ఔద్ మేథా రోడ్ ద్వారా బుర్ దుబాయ్ నుండి దీరాకు : అల్ మక్తూమ్ వంతెన, అల్ గర్హౌద్ వంతెనలను ఉపయోగించవచ్చు.
అల్ రియాద్ స్ట్రీట్ ద్వారా బర్ దుబాయ్ నుండి డీరాకు: అల్ మక్తూమ్ వంతెనను ఉపయోగించవచ్చు.
బుర్ దుబాయ్, దీరా మధ్య ప్రయాణించే వాహనదారులు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్, ఎమిరేట్స్ రోడ్ వంటి ప్రధాన రహదారులను ఉపయోగించవచ్చు. ఫ్లోటింగ్ బ్రిడ్జిని మూసివేసే సమయంలో సజావుగా ప్రవహించేలా ట్రాఫిక్ కదలికలను పర్యవేక్షిస్తామని అధికార యంత్రాంగం తెలిపింది. వాహనదారులు వేగ పరిమితులను పాటించాలని, ప్రత్యామ్నాయ రహదారులు, ప్రజా రవాణా మార్గాలను ఉపయోగించాలని కోరారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు







