వినియోగదారుల రక్షణ చట్టం ఉల్లంఘన.. OMR 23,000 జరిమానా, జైలు శిక్ష

- April 15, 2023 , by Maagulf
వినియోగదారుల రక్షణ చట్టం ఉల్లంఘన.. OMR 23,000 జరిమానా, జైలు శిక్ష

మస్కట్: సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లోని విలాయత్ ఆఫ్ బార్కాలో వినియోగదారుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించినందుకు నిందితుడికి OMR 23,000 జరిమానా, ఒక నెల జైలు శిక్ష విధించారు. బార్కా విలాయత్‌లోని ఫస్ట్ ఇన్‌స్టాన్స్ కోర్ట్ ఇటీవలే రాయల్ డిక్రీ నంబర్ (66/2014) ద్వారా అందించబడిన వినియోగదారుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించినందుకు వాణిజ్య సంస్థకు వ్యతిరేకంగా తీర్పు వెలువడింది. పారదర్శకత, విశ్వసనీయత , సేవల్లో లోపాలు, వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రకటనల నేపథ్యంలో సంస్థ ప్రతినిధికి కోర్టు శిక్షలు ఖరారు చేసింది. బిల్డింగ్ మెటీరియల్స్, శానిటరీ వేర్‌లను కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత నిర్మాణ సామగ్రిని విక్రయించే రంగంలో పనిచేస్తున్న ఒక వాణిజ్య సంస్థపై బార్కాలోని వినియోగదారుల రక్షణ విభాగానికి అనేక ఫిర్యాదులు అందాయి. దీనిపై  అడ్మినిస్ట్రేషన్ అవసరమైన చర్యలను చేపట్టింది. కేసు ఫైల్‌ను బార్కాలోని పబ్లిక్ ప్రాసిక్యూషన్ డిపార్ట్‌మెంట్‌కు రిఫర్ చేసింది. చట్టపరమైన విధానాలను పూర్తి చేసి, సమర్థ న్యాయస్థానానికి  కేసును పంపింది. కోర్టు సంస్థ ప్రతినిధిని దోషిగా నిర్ధారించి శిక్షలు ఖరారు చేసింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com