తెలుగులో సీఆర్పీఎఫ్ పరీక్షలు...
- April 15, 2023
న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.కేంద్రం ద్వారా నిర్వహించే కేంద్ర భద్రతా దళాల కానిస్టేబుల్ ఎంపిక పరీక్షలను (CRPF Exams) తెలుగు సహా 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ప్రాంతీయ భాషల్లో ఈ పరీక్ష నిర్వహించాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, తెలంగాణ మంత్రి కేటీఆర్ సహా పలువురి నుంచి విజ్ణప్తులు అందాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
వచ్చే ఏడాది నుంచి 13 ప్రాంతీయ భాషల్లో సీఏపీఎఫ్ పరీక్షలను నిర్వహించనున్నట్లు కేంద్ర హోం వ్యవహారాల శాఖ నిర్ణయం తీసుకుంది. స్థానిక యువత ప్రమేయాన్ని పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటి వరకు ఈ పరీక్ష హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే నిర్వహించేవారు. తాజా నిర్ణయంతో అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మళయాలం, కన్నడ, తమిళ్, తెలుగు, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపూరీ, కొంకణీ భాషల్లో నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు
- CBSE బోర్డ్ ఎగ్జామ్స్: ఆఖరి 3 వారాల స్మార్ట్ రివిజన్ ప్లాన్..
- మేడారంలో భక్తజన సంద్రం
- మేనేజర్ నైపుణ్యం పై ఫిర్యాదు చేయవచ్చా?
- భారత్ పై న్యూజిలాండ్ ఘన విజయం
- ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- ఫాస్టాగ్ యూజర్లకు గుడ్ న్యూస్..
- దోహా మ్యూజిక్ లవర్స్ ఆధ్వర్యంలో రిథమ్ రైజ్‌తో గానం & నృత్య పోటీలు
- మంత్రులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు







