రియాద్ లో తెలుగు సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు
- April 15, 2023
రియాద్: భిన్నత్వములో ఏకత్వం గురించి చాటి చెబుతూ APNRTS (ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ), TKK (తెలుగు కళాక్షేత్రం) తరుపున, ఉమ్మడి కుటుంబము లాంటి రియాద్ తెలుగు కుటుంబ సమ్మేళనం గ్రూపు తరుపున రియాద్ లోని Al Mas రెస్టౌరెంట్ లో URPL ఇఫ్తార్ ఏర్పాటు చేయడం జరిగింది.ఈ ఇఫ్తార్ విందుకు విచ్చేసిన మన ముస్లిం సోదరులకు, URPL (ఉగాది & రమదాన్ ప్రీమియర్ లీగ్) క్రికెట్ టీమ్స్ కు, మిత్రులకు, అతిధులకు,అల్ ఇండియా స్టీరింగ్ కమిటీ సభ్యులకు రియాద్ తెలుగు కుటుంబ సమ్మేళనం కమిటీ సభ్యుల తరుపున స్వాగతించారు.
ఈ కార్యక్రమం ఇఫ్తార్ తో మొదలై URPL (ఉగాది & రమదాన్ ప్రీమియర్ లీగ్) క్రికెట్ పోటీలలో గెలిచిన టీం సభ్యులకు మరియు అత్యంత ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు మరియు URPL కు సహకరించిన మిత్రులకు అల్ ఇండియా స్టీరింగ్ కమిటీ సభ్యుల చేతులమీదుగా విన్నర్ (రియాద్ సూపర్ కింగ్స్-స్పార్టాన్స్, కెప్టెన్: మహేంద్ర వాకాటి & టీం ),రన్నర్ (తెలుగు టైటాన్స్ ఫైటర్స్) - కెప్టెన్: జిలాని షేక్ & టీం), ప్లేయర్ ఆఫ్ ది మ్యాచెస్ (అమర్ మూలసాని, హిమవంత్ రెడ్డి, RVP ప్రసాద్, అశోక్ పెర్నేటి, శ్రీధర్, సుభాష్ వడ్లమాని, బెస్ట్ బౌలర్ (RVP ప్రసాద్), బెస్ట్ బ్యాట్స్మన్(హిమవంత్ రెడ్డి), థాంక్స్ ఫర్ సపోర్టింగ్ (శ్రీనివాస్ ఆరె, ప్రశాంత్ రెడ్డి) ట్రోఫీలను అందుకున్నారు.
3 వారాలు జరిగిన ఈ URPL క్రికెట్ పోటీలకు మిత్రుడు కోళ్ల వెంకట భాస్కర్ ఐస్ క్రీములు, జిలాని షేక్ మంచినీరు మరియు జిలాని మేనల్లుడు జ్ఞాపకార్ధము ట్రోఫీలను అందించారు.సుమన్ తన వంతు సహాయముగా క్రికెట్ కిట్స్ అందించారు మరియు రియాద్ తెలుగు కుటుంబ సమ్మేళనము గ్రూపు తరుపున URPL క్రికెట్ పోటీలను చూడడానికి వచ్చిన అతిధులకు అల్పాహారము అందించారు.వీరందరు అందించిన సహాయ సహాయసహకారాలకు అందరి తరుపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ URPL ఇఫ్తార్ ఏర్పాటు కు సహకరించిన TKK (తెలుగు కళాక్షేత్రం) ప్రెసిడెంట్, APNRTS రీజినల్ కో-ఆర్డినేటర్ రెవెల్ ఆంథోనీ అబెల్ & టీం సభ్యులకు, మిత్రులు అనిల్ మర్రి, శ్రీకాంత్ దండే, సంజయ్ మరియు రియాద్ తెలుగు కుటుంబ సమ్మేళనం గ్రూపు సభ్యులకు అందరి తరుపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
గత 6 సంవత్సరములుగా పైగా ఒక ఉమ్మడి కుటుంబముగా అందరూ కలసి జరుపుకుంటున్న సంక్రాంతి సంబరాలు, దీపావళి సంబరాలు, కృష్ణాష్టమి, ఇతర పండుగలను జరుపుకొనుటకు సహరించిన మరియు ఎల్లప్పుడూ సహకరిస్తున్న మిత్రులు భాస్కర్ గంధవల్లి, నటరాజ్ & టీం , RVP ప్రసాద్ & టీం, మహేంద్ర వాకాటి & టీం, మురారి & టీం, నరేష్ చెన్నుపాటి, ఇబ్రహీం, నాగేంద్ర, విజయ్ గొల్ల, సిద్దిఖ్, శ్రీనివాస్, ప్రశాంత్, కరుణ్, ప్రసాద్ అన్న, ప్రవీణ్ పోకిరి, సుఖేష్ ఇలా చాలా మంది మిత్రులకు అందరి తరుపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి వచ్చిన అతిధులు మహమ్మద్ జియాగం ఖాన్ (అల్ ఇండియా స్టీరింగ్ కమిటీ కన్వినర్),షెహబ్ కొత్తకల్ (ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు గ్రహీత), సతీష్ దీపక్ (సామాన్య ప్రెసిడెంట్ మరియు యోగ ఫౌండర్, సౌదీ అరేబియా), అహ్మద్ ఇంతియాజ్ (తమిళనాడు కమ్యూనిటీ ప్రెసిడెంట్) ,మొహిద్దీన్ సలీం(డిప్యూటీ జెన్. మేనేజర్ అరబ్ నేషనల్ బ్యాంకు (ట్రజరరీ డిపార్ట్మెంట్) & ప్రెసిడెంట్ ఆఫ్ IFPF), అబ్దుల్ జబ్బార్ (TNRIF (తెలంగాణ NRI ఫోరమ్) ఫౌండర్ & ప్రెసిడెంట్), సంతోష్ శెట్టి (కరవాలి ప్రెసిడెంట్) మరియు రెవెల్ ఆంథోనీ అబెల్(ప్రెసిడెంట్ తెలుగు కళాక్షేత్రం) , APNRTS రీజినల్ కో-ఆర్డినేటర్) రమదాన్ మాసంలో జరిగే ఇఫ్తార్ గురించి మరియు క్రీడల యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ భవిష్యత్తులో జరుగబోయే క్రికెట్ టోర్నమెంట్ లకు తమవంతు సహాయసహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన అల్ ఇండియా స్టీరింగ్ కమిటీ సభ్యులను రియాద్ తెలుగు కుటుంబ సమ్మేళనము కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.
చివరిగా ఈ క్రయక్రమం విజయవంతము కావడానికి సహకరించిన మిత్రులకు, అతిధులకు, అల్ ఇండియా స్టీరింగ్ కమిటీ సభ్యులకు & ఇలా ప్రతి ఒక్కరికి పేరు పేరున తిరుపతి స్వామి స్వర్ణ తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు.





తాజా వార్తలు
- షేక్ ఖలీఫా బిన్ మొహమ్మద్ వివాహాం..కింగ్ హమద్ హాజరు..!!
- అల్-సబాహియాలో లూనా పార్క్ ప్రారంభం..!!
- షినాస్ తీరంలో డ్రగ్స్ కలకలం..ఇద్దరు అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యలను ఖండించిన సౌదీ సహా 14 దేశాలు..!!
- షార్జాలో కొత్త ట్రాఫిక్ లా.. నవంబర్ 1 నుండి అమలు..!!
- ఖతార్లో ఇండియన్ పాస్ పోర్ట్ కోసం న్యూ గైడ్ లైన్స్ జారీ..!!
- దుబాయ్: ప్రవాసాంధ్రులతో రేపు సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్
- ప్రయాణికులకు RTC ఆత్మీయ స్వాగతం!
- అబుదాబీ పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీల్లో సీఎం చంద్రబాబు
- ఏపీ మీదుగా రెండు హై స్పీడ్ రైలు







