బహ్రెయిన్ లో వేల సంఖ్యల్లో ఎలుకలు.. వ్యాధుల వ్యాప్తిపై ఆందోళన
- April 16, 2023
బహ్రెయిన్: సిత్రా, మినా సల్మాన్ బహ్రెయిన్లో వ్యాపార హాట్స్పాట్లు. బహ్రెయిన్ మొత్తం పెట్రోలియం ఉత్పత్తి సిత్రాలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర సౌదీ అరేబియా చమురు వనరులకు ఎగుమతి కేంద్రంగా కూడా ఉంది. మినా సల్మాన్ ఒక ప్రధాన గల్ఫ్ నౌకాశ్రయం, ఇది 1960ల నుండి అరేబియా గల్ఫ్కు గేట్వేగా పనిచేస్తుంది. అయితే, ఈ ప్రంతాలు ఇప్పుడు వార్తల్లో నిలిచాయి. ఈ ప్రాంతాల్లో వేలాది సంఖ్యలో ఉన్న ఎలుకలు ఇక్కడి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అదే విధంగా అద్లియా, గుదైబియా, ఉమ్ అల్ హస్సమ్ నివాసితులు కూడా తాము ఎలుకల సమస్యను ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. గత కొన్ని నెలలుగా ఎలుకల బెడద విపరీతంగా పెరిగిపోయిందని వారు చెబుతున్నారు. ఎలుకల సంఖ్య విపరీతంగా పెరగడం పర్యావరణానికి మాత్రమే కాకుండా మానవులకు కూడా ప్రమాదకరమైందని నిపుణులు చెబుతున్నారు. ఎలుకల విసర్జన, మూత్రాన్ని పీల్చడం వల్ల కలిగే శ్వాసకోశ సమస్యలు పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తాయని హెచ్చరిస్తున్నారు.
అల్ కల్లాఫ్ పెస్ట్ కంట్రోల్ సర్వీస్ డైరెక్టర్ హసన్ అల్ కల్లాఫ్ మాట్లాడుతూ.. వాతావరణ మార్పుల కారణంగా నివాస సముదాయాల్లో ఎలుకల సంఖ్య విపరీతంగా పెరుగుతుందన్నారు. చాలా మంది పక్షులకు ఆహారం ఇవ్వడానికి తమ ఇంటి బయట మిగిలిపోయిన ఆహారాన్ని వదిలివేస్తారని, ఇది ఎలుకలను ఆకర్షిస్తాయన్నారు. మనామా, గుదైబియా, అద్లియా ఇతర ప్రాంతాలలో ఎలుకల జనాభాలో ఆకస్మిక పెరుగుదలకు మురుగునీటి సమస్య కూడా కారణమై ఉండొచ్చని కల్లాఫ్ అభిప్రాయపడ్డారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఇప్పటి వరకు ఎలుకల సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. ఎలుకలు తమతో పాటు అనేక వ్యాధులను మోసుకొస్తాయని ఆయన హెచ్చరిస్తున్నారు. ఎలుకలు నీరు, బొచ్చు, లాలాజలంతో ఆహారాన్ని కలుషితం చేస్తాయని, తినే ఆహారాన్ని ఎలుకలు పది రెట్లు కలుషితం చేస్తాయన్నారు.
తాజా వార్తలు
- భక్తులకు టీటీడీ అలర్ట్: మార్చి 3న ఆలయం మూసివేత
- పీటీ ఉషా భర్త శ్రీనివాసన్ కన్నుమూత
- తాడేపల్లిగూడెంలో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదన
- డబ్డూబ్ వరల్డ్..2.5 KD ప్లే జోన్ ఆఫర్..!!
- ఫేక్ వర్క్ పర్మిట్లు.. ఎనిమిది మందికి శిక్షలు ఖరారు..!!
- ఒమన్ లో ఆర్కియాలజీపై ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్..!!
- సౌదీ అరేబియా జీడీపీ 4.8% వృద్ధి..!!
- జెబెల్ జైస్ జనవరి 31న రీ ఓపెన్..!!
- మెట్రోలింక్ సేవలను అప్డేట్ చేసిన దోహా మెట్రో..!!
- 'ఫౌజీ' దసరాకి గ్రాండ్ గా రిలీజ్







