విద్యాశాఖలో ప్రవాసుల తొలగింపు తాత్కాలికంగా నిలిపివేత..!
- April 16, 2023
కువైట్: ప్రవాస ఉపాధ్యాయ, సిబ్బంది తొలగింపు విధానాన్ని మరోసారి కువైట్ విద్యా మంత్రిత్వ శాఖ సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. అర్హత కలిగిన కువైటీలు, GCC జాతీయులు లేదా కువైట్ తల్లుల పిల్లలు భర్తీ చేయడానికి అందుబాటులో ఉండే వరకు ప్రవాస సిబ్బంది తొలగింపును తాత్కలికంగా నిలిపివేయనున్నట్లు సమాచారం. స్థానిక వార్త పత్రికల కథనాల ప్రకారం.. ఇప్పటికే తొలగించబడిన వారి స్థానంలో నియమించేందుకు అర్హులైన స్థానికులు అందుబాటులో లేరని, కువైటైజేషన్ విధానాన్ని నెమ్మదిగా కొనసాగించాలని ఉపాధ్యాయుల సంఘం డిమాండ్లను మంత్రిత్వ శాఖ పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. విద్యా స్థాయి ప్రమాణాలు అకస్మాత్తుగా పడిపోకుండా ఉండటానికి, అర్హత కలిగిన కువైటీల లభ్యతను నిర్ధారించి, అదే స్థాయిలో పనితీరును ప్రదర్శించగల వారి సామర్థ్యాన్ని నిర్ణయించిన తర్వాత మాత్రమే తదుపరి తొలగింపులు జరుగుతాయని విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
తాజా వార్తలు
- భక్తులకు టీటీడీ అలర్ట్: మార్చి 3న ఆలయం మూసివేత
- పీటీ ఉషా భర్త శ్రీనివాసన్ కన్నుమూత
- తాడేపల్లిగూడెంలో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదన
- డబ్డూబ్ వరల్డ్..2.5 KD ప్లే జోన్ ఆఫర్..!!
- ఫేక్ వర్క్ పర్మిట్లు.. ఎనిమిది మందికి శిక్షలు ఖరారు..!!
- ఒమన్ లో ఆర్కియాలజీపై ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్..!!
- సౌదీ అరేబియా జీడీపీ 4.8% వృద్ధి..!!
- జెబెల్ జైస్ జనవరి 31న రీ ఓపెన్..!!
- మెట్రోలింక్ సేవలను అప్డేట్ చేసిన దోహా మెట్రో..!!
- 'ఫౌజీ' దసరాకి గ్రాండ్ గా రిలీజ్







