గల్ఫ్ దేశాల సైనికులు,వీర మహిళల సేవలు అభినందనీయం: నాగబాబు

- April 17, 2023 , by Maagulf
గల్ఫ్ దేశాల సైనికులు,వీర మహిళల సేవలు అభినందనీయం: నాగబాబు

హైదరాబాద్: గల్ఫ్ లోని యూఏఈ,కువైట్,సౌదీ అరేబియా,ఒమన్,బహ్రెయిన్,ఖతార్ జన సైనికులు, వీర మహిళలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చేస్తున్న సామాజిక సేవలు చాలా గొప్పవని  జనసేన ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు వెల్లడించారు.గల్ఫ్ దేశాల్లో స్థిర పడిన జన సైనికులు, వీర మహళలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాగబాబు మాట్లాడారు.గతంలో కరోనా ఉదృతి సందరంభంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ఆక్సిజెన్ సీలిండర్లు ఏర్పాటు చెయ్యడం,లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడిన పేద వారికి నిత్యావసర వస్తువులు అందించడం.'నా సేన కోసం నా వంతు' కు, జన సేన పార్టీ కార్యక్రమాలకు చేయూత తదితర సామాజిక కార్యక్రమాలకు అందించిన సహకారం అమూల్యమైనదని నాగబాబు అన్నారు.కేసరి త్రిమూర్తులు,చందక రామదాస్,కంచర శ్రీకాంత్ తదితర నేతృత్వంలో దాదాపు 600 మందికి పైగా జన సైనికులు,వీర మహిళలు గల్ఫ్ దేశాల్లో తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందిస్తున్న సేవల అమూల్యమైనవని నాగబాబు పునర్ఘటించారు.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com