స్నేహితులు, బంధువులను ఎయిర్పోర్టులో డ్రాప్ చేస్తే.. ఇకపై నో ఫైన్

- April 17, 2023 , by Maagulf
స్నేహితులు, బంధువులను ఎయిర్పోర్టులో డ్రాప్ చేస్తే.. ఇకపై నో ఫైన్

మస్కట్: స్నేహితులను విమానాశ్రయానికి తీసుకెళ్లే లేదా వారి ప్రైవేట్ వాహనాల్లో సరుకులను డెలివరీ చేస్తున్న ప్రవాసులపై జరిమానాలు విధించినట్లు వచ్చిన ఆరోపణలపై రవాణా, కమ్యూనికేషన్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MoTCIT) స్పందించింది.  “ఇటీవల భూ రవాణాపై తనిఖీ ప్రచారాలు విస్తృతం చేశాము.  నిబంధనల అమలులో భూ రవాణా వినియోగదారుల భద్రత, వస్తువుల భద్రత, భూ రవాణా పార్టీల హక్కులను సంరక్షించడం తమ బాధ్యత. భూ రవాణా చట్టంలోని కార్యనిర్వాహక నిబంధనల నిబంధనలను ఉల్లంఘించే డ్రైవర్లకు మాత్రమే జరిమానా విధించాలని తనిఖీ బృందాలను ఆదేశించాం. ఎటువంటి ఆర్థిక ప్రతిఫలం లేకుండా తమ పరిచయస్తులు, స్నేహితులను రవాణా చేసే డ్రైవర్లకు ఎలాంటి ఫైన్ వేయొద్దని ఆదేశించాం.’’ అని మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రజలు తమ స్నేహితులు లేదా బంధువులను రవాణా చేస్తున్నప్పుడు జరిమానా విధిస్తే.. వారి ఫిర్యాదులను అది జారీ చేసిన తేదీ నుండి 15 రోజులలోపు మంత్రిత్వ శాఖ జనరల్ ఆఫీస్‌లోని భూ రవాణా శాఖ లేదా గవర్నరేట్‌లోని రోడ్స్ డిపార్ట్‌మెంట్‌లో సమీక్ష కోసం సమర్పించవచ్చని సూచించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com