ముఖ్య నేతలతో ఏపీ సీఎం జగన్ అత్యవసర సమావేశం
- April 17, 2023
అమరావతి: ఏపీ సీఎం జగన్..తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసారు. ఈ భేటీ కి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. వివేకానందరెడ్డి హత్య కేసులో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత చోటుచేసుకుంది.
వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి అరెస్టు కావడం, ఈరోజు సీబీఐ ముందు వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి హాజరుకానుండటంతో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అంతకుముందు ఈ ఉదయాన్నే అవినాశ్ రెడ్డిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కలిశారు. సీబీఐ విచారణకు హాజరయ్యేందుకు పులివెందుల నుంచి హైదరాబాద్ కు అవినాశ్ రెడ్డి బయల్దేరినప్పుడు.. ఆయనతోపాటు చెవిరెడ్డి ఉన్నారు. ఆ సమయంలో అవినాశ్ తో చర్చించిన అంశాలను జగన్ కు చెవిరెడ్డి వివరించినట్లు సమాచారం. ఇక తనను సీబీఐ అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టును అవినాశ్ రెడ్డి ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను కోర్టు ఈ రోజు విచారించనుంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







