భారత్ లో కొత్తగా 7,633 కరోనా కేసులు
- April 18, 2023
న్యూ ఢిల్లీ: భారత దేశంలో రోజువారీ కరోనా కేసులు మొన్నటి కంటే నిన్న కాస్త తగ్గాయి. భారత్ లో మొన్న మొత్తం కలిపి 9,111 కొవిడ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. కొత్తగా 7,633 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఇవాళ తెలిపింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 61,233గా నమోదైందని వివరించింది.
మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.14గా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.63 శాతంగా నమోదైందని పేర్కొంది. వారాంతపు పాజిటివిటీ రేటు 5. 04 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గత 24 గంటల్లో 6,702 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు వివరించింది.
దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,42,42,474కి చేరింది. రివకరీ రేటు 98.68 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు 220.66 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వినియోగించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. గత 24 గంటల్లో 749 వ్యాక్సిన్ డోసులు వేసినట్లు తెలిపింది.
దేశంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం కలిపి 92.43 కోట్ల పరీక్షలు చేశారని వివరించింది. గత 24 గంటల్లో 2,11,029 పరీక్షలు చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XBB1.16 వ్యాప్తి చెందుతోంది. దీనిపై ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర సర్కారు అప్రమత్తం చేసింది.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







