స్కూటర్ కడిగిన క్లీనర్‌ను కత్తితో బెదిరించిన యువకుడికి జైలుశిక్ష
- April 19, 2023
దుబాయ్: క్లీనర్‌ను కత్తితో పొడిచి బెదిరించిన 23 ఏళ్ల యువకుడిని దుబాయ్ క్రిమినల్ కోర్టు దోషిగా నిర్ధారించి.. మూడు నెలల జైలుశిక్ష విధించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. దుబాయ్‌లోని అల్ త్వార్ ప్రాంతంలోని ఓ కోఆపరేటివ్ సొసైటీకి చెందిన సెక్యూరిటీ గార్డు క్లీనర్‌ను ఓ యువకుడు కత్తితో బెదిరించడం చూశానని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గల్ఫ్ దేశస్థుడైన 23 ఏళ్ల వ్యక్తి తన ఎలక్ట్రిక్ స్కూటర్‌తో సొసైటీలోని పార్కింగ్ స్థలంలోకి ప్రవేశించడం తాను చూశానని గార్డు చెప్పాడు. వాహనాన్ని శుభ్రం చేయాలని క్లీనర్‌ను కోరాడని, క్లీనర్ పని పూర్తి చేసిన తర్వాత 10 దిర్హామ్‌లు చెల్లించమని అడగగా.. నిందితుడు డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించి.. క్లీనర్‌పై అవరవడం ప్రారంభించాడు. విచారణలో, నిందితుడు స్కూటర్‌ను శుభ్రం చేసిన తర్వాత డబ్బు ఇవ్వడానికి నిరాకరించాడని, ఆపై కత్తి తీసి తనపై దాడి చేస్తానని బెదిరించాడని బాధితుడు పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా
- లగ్జరీ కార్లకు కేరాఫ్ అడ్రస్‌గా రాయ్..అంతిమ యాత్రలోనూ దర్శనం
- బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు
- తెలంగాణలో గృహాలకు ఫ్రీగా విద్యుత్ కనెక్షన్లు
- తెలంగాణ: మార్చి నెల 19న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం
- మూడేళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమే ! ధీమా వ్యక్తం చేసిన జగన్
- ఢిల్లీలో 15 రోజుల్లో 807 మంది అదృశ్యం
- ఖతార్ రాజధాని దోహాలో మంత్రి నారాయణ బృందం పర్యటన
- ఖతార్ లో క్లాస్రూమ్ రీడింగ్ బ్యాగ్ ప్రాజెక్ట్..!!
- బహ్రెయిన్ లో రమదాన్ మద్దతుకు ఎంపీల ప్రతిపాదన..!!







