స్కూటర్ కడిగిన క్లీనర్‌ను కత్తితో బెదిరించిన యువకుడికి జైలుశిక్ష

- April 19, 2023 , by Maagulf
స్కూటర్ కడిగిన క్లీనర్‌ను కత్తితో బెదిరించిన యువకుడికి జైలుశిక్ష

దుబాయ్: క్లీనర్‌ను కత్తితో పొడిచి బెదిరించిన 23 ఏళ్ల యువకుడిని దుబాయ్ క్రిమినల్ కోర్టు దోషిగా నిర్ధారించి.. మూడు నెలల జైలుశిక్ష విధించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. దుబాయ్‌లోని అల్ త్వార్ ప్రాంతంలోని ఓ కోఆపరేటివ్ సొసైటీకి చెందిన సెక్యూరిటీ గార్డు క్లీనర్‌ను ఓ యువకుడు కత్తితో బెదిరించడం చూశానని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గల్ఫ్ దేశస్థుడైన 23 ఏళ్ల వ్యక్తి తన ఎలక్ట్రిక్ స్కూటర్‌తో సొసైటీలోని పార్కింగ్ స్థలంలోకి ప్రవేశించడం తాను చూశానని గార్డు చెప్పాడు. వాహనాన్ని శుభ్రం చేయాలని క్లీనర్‌ను కోరాడని, క్లీనర్ పని పూర్తి చేసిన తర్వాత  10 దిర్హామ్‌లు చెల్లించమని అడగగా.. నిందితుడు డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించి.. క్లీనర్‌పై అవరవడం ప్రారంభించాడు. విచారణలో, నిందితుడు స్కూటర్‌ను శుభ్రం చేసిన తర్వాత డబ్బు ఇవ్వడానికి నిరాకరించాడని, ఆపై కత్తి తీసి తనపై దాడి చేస్తానని బెదిరించాడని బాధితుడు పేర్కొన్నాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com