మళ్లీ మార్పు చేర్పులతో రాజధాని డిజైన్లు
- May 09, 2016
ఆంధ్రప్రదేశ్ రాజధాని డిజైన్లు మళ్లీ మొదటికే వచ్చినట్లు అయింది. మరోసారి రాజధాని డిజైన్లు మారనున్నాయి. రాజధానిలో ప్రభుత్వ భవనాల సముదాయం కోసం జపాన్ రూపొందించిన డిజైన్ కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందనే విమర్శలతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
ప్రముఖ ఆర్కిటెక్ట్స్ సంస్థలతో మంత్రి నారాయణ సోమవారం విజయవాడలోని ఓ ప్రముఖ హోటల్ లో సంప్రదింపులు జరిపారు. డిజైన్ వ్యవహారం మళ్లీ మొదటికే రావడంతో 2017 ఏప్రిల్ నాటికి పూర్తిస్థాయి డిజైన్లు రూపొందించి 2018 కల్లా నిర్మాణం పూర్తయ్యేలా చూడాలనే ప్రభుత్వ ప్రయత్నం ఫలించే సూచనలు కనిపించడం లేదు.మొదట సింగపూర్ మాస్టర్ ప్లాన్ అని, ఆ తర్వాత జపాన్ కంపెనీకి సంబంధించి డిజైన్లు అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఊదరగొట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ డిజైన్ లోని అసెంబ్లీ భవనాలు పొగగొట్టాల్లా ఉండడం, అదే తరహా అసెంబ్లీ భవనం చండీగఢ్‌లో ఉండడంపై సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ఇక్కడి డిజైన్లనే కాపీ కొట్టి జపాన్ కంపెనీ అంతర్జాతీయ స్థాయి అన్నట్టు చూపించిందని ప్రచారం జరిగింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం పునరాలోచలో పడింది. ఇప్పటికే సింగపూర్, జపాన్ సంస్థల నుంచి డిజైన్లు తీసుకున్న ఏపీ సర్కార్ తాజాగా కొత్తగా మూడో డిజైన్ కోసం ప్రయత్నిస్తోంది. రాజధాని డిజైన్ల కోసం సింగపూర్ కంపెనీకి రూ.11 కోట్లు, జపాన్ సంస్థ మకీ డిజైన్ కు రూ.కోటి ఖర్చు చేసింది. ఎంపిక తతంగానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా, తీరా అది తుస్సుమనడంతో డిజైన్‌ను మార్చడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్‌లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







