తగ్గిన బంగారం ధర
- May 09, 2016
రెండేళ్ల గరిష్ఠ ధరకు చేరుకున్న పసిడి సోమవారం స్వల్పంగా దిగివచ్చింది. రూ.250 తగ్గడంతో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.30,100కు చేరింది. ధర ఎక్కువగా ఉండటంతో అక్షయ తృతీయ పర్వదినం కొనుగోళ్లు ప్రోత్సాహకరంగా లేకపోవడం, ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో ఇవాళ ధర తగ్గిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్ బులియన్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.7శాతం తగ్గి 1,279.80 అమెరికన్ డాలర్లకు చేరింది.
వెండి ధర సైతం సోమవారం తగ్గింది. రూ.350 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.41,200కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో దీని ధర తగ్గిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్ బులియన్ మార్కెట్లో ఔన్సు వెండి ధర 17.37 యూఎస్ డాలర్లకు చేరింది.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







