45 మంది తాలిబన్ ఉగ్రవాదులు హతం
- May 09, 2016
అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌లో తాలిబన్ ఉగ్రవాదులు పన్నిన ఉగ్రదాడులను అఫ్గానిస్థాన్ భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. కునార్ ప్రావిన్స్‌లోని ఘజియాబాద్ జిల్లాలో భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 45 మంది తాలిబన్ ఉగ్రవాదులు మృతిచెందారు. ఘజియాబాద్‌లోని పలు సెక్యూరిటీ పోస్టుల వద్ద ఉగ్రవాదులు దాడులకు పాల్పడేందుకు యత్నించగా విజయవంతంగా తిప్పికొట్టినట్లు అఫ్గాన్ నేషనల్ ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఓ ఆర్మీ అధికారి మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఉగ్రవాదులు కునార్ ప్రావిన్స్‌లోనే ఎక్కువగా దాడులకు పాల్పడుతుంటారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్‌లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







