సెప్టెంబర్ నుంచి విశాఖ నుంచే పాలన: ఏపీ సిఎం జగన్
- April 19, 2023
అమరావతి: శ్రీకాకుళం పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక ప్రకటన చేశారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా రానున్న సెప్టెంబర్ నెల నుంచి విశాఖ నుంచే పాలన సాగిస్తామన్నారు.ఈ సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటానని సిఎం జగన్ స్పష్టం చేశారు.
సిఎం జగన్ మాట్లాడుతూ ... రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వారికి ఆమోద్యయోగ్యమైన నగరం విశాఖ అని, అందుకే విశాఖను రాజధానిగా చేశామని ముఖ్యమంత్రి వైఎస్.జగన్ ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెత్తందారులకు.. పేదల పక్షాన నిలబడ్డ తనకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు.. ప్రజలంతా ఈ యుద్ధంలో తనకు అండగా ఉండాలని కోరారు. '' మీ బిడ్డ ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరేలా పని చేస్తున్నాడు... మీకు లబ్ధి చేకూరిందని నమ్మితేనే నాకు ఓటేసి ఆశీర్వదించండి '' అని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ ను సిఎం జగన్ ప్రకటించారు.
తాజా వార్తలు
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం







