బహ్రెయిన్ లో పెరుగుతున్న క్యాట్‌కాలింగ్ ఫిర్యాదులు..!
- April 20, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్ వీధుల్లో క్యాట్ కూలింగ్ (లైంగిక వేధింపులు) కేసులు పెరుగడం ఆందోళన కలిగిస్తోంది. తాము వీధుల్లో వెళ్లే క్రమంలో తరచూ వేధింపులకు గురవుతున్నట్లు పలువురు యువతులు, మహిళలు అధికారులకు ఫిర్యాదులు చేయడం ఇటీవల పెరిగినట్లు ఓ భద్రతా అధికారి తెలిపారు. కానీ చాలామంది ఇలాంటి విషయాలను అధికారుల దృష్టికి తీసుకురాకపోవడంతో ఇటీవల ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయని సదరు అధికారి చెప్పారు.
క్యాట్‌కాలింగ్ అంటే..
వీధుల్లో లేదా ఎక్కడైనా యువతులు, మహిళలను తమ వైపుకు పిలవాలని ఎవరైనా(నిందితులు) కోరుకున్నప్పుడు- ఆమెను కించపరచడానికి క్యాట్‌కాలింగ్(వేధింపులు) చాలా తరచుగా జరుగుతుంది. చాలా సార్లు, నేరస్తుడు కించపరిచే వ్యాఖ్యలు చేస్తూ, ఆమె శరీరాన్ని ఒక వస్తువుగా భావించి వ్యాఖ్యలు చేస్తుంటారు. దురదృష్టవశాత్తు, మహిళలు వీధిలో నడుస్తున్నా, బైక్ నడుపుతున్నా లేదా డ్రైవింగ్ చేసినా, చాలా మంది మహిళలు క్యాట్‌కాలింగ్ లేదా వీధి వేధింపులను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
ఓ పద్దెనిమిదేళ్ల బహ్రెయిన్ అమ్మాయి తన అనుభవాలను తెలుపుతూ.. దురదృష్టవశాత్తు క్యాట్‌కాలింగ్ చాలా సాధారణంగా మారిందన్నారు. తనలాంటి చాలా మంది అమ్మాయిలు అలాంటి చర్యలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఆగడం లేదన్నారు. అయితే, వీటిని అడ్డుకునేందుకు నేరస్థుల వెహికిల్ నంబర్ ప్లేట్ చిత్రాలను తీయడం ప్రారంభించానని ఆమె తెలిపింది. ఇలాంటి చర్యల్లో నిందితులకు శిక్షలు పడే అవకాశాలు తక్కువగా ఉంటాయని, కానీ ఇలా ఫోటోలు, వీడియోలు తీస్తే.. వారు కాస్తా భయపడి వెనక్కి తగ్గే అవకాశం ఉందని, దాంతో భవిష్యత్తులో వారు ఇతరులను క్యాట్కాల్ చేయకుండా నిరోధించవచ్చని ఆమె చెప్పింది. మహిళలు క్యాట్‌కాలింగ్ లేదా వీధి వేధింపుల భయాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని, ఇలాంటి ఘటనలు ఎదురైన సందర్భాల్లో భద్రతాధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







