ఖతార్ సరిహద్దులో నమోదిత వాహనాల కోసం ప్రత్యేక లేన్

- April 20, 2023 , by Maagulf
ఖతార్ సరిహద్దులో నమోదిత వాహనాల కోసం ప్రత్యేక లేన్

దోహా: ఈద్ అల్ ఫితర్ వేడుకలకు రెండ్రోజుల ముందు అబూ సమ్రా సరిహద్దును దాటే ప్రీ-రిజిస్టర్డ్ వాహనాలకు ఒక లేన్‌ను కేటాయించనున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ (MoI) వెల్లడించింది. దేశంలోకి వీసా సేవల కోసం హయ్యా ప్లాట్‌ఫారమ్‌ను విస్తరించనున్నట్లు పేర్కొంది. Metrash2 ద్వారా పౌరులు, నివాసితులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మంత్రిత్వ శాఖ సూచించింది. ముందస్తు నమోదు ద్వారా సమయం ఆదా అవ్వడంతోపాటు క్యూలను నిరోధిస్తుందని మంత్రిత్వ శాఖ తన ట్వీట్ లో తెలిపింది. మరోవైపు ఖతార్ టూరిజం హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం, అబూ సమ్రా సరిహద్దుకు వచ్చే సందర్శకులు ఈద్ అల్-ఫితర్ 2023 సందర్భంగా ప్రత్యేక ‘ఈద్య’ బహుమతి ప్యాకేజీని అందుకోనున్నట్లు ప్రకటించింది. సందర్శకులకు పర్యాటక అనుభవాన్ని మెరుగుపరచడం, ప్రయాణికులకు స్వాగతించే గమ్యస్థానంగా ఖతార్‌ను ప్రోత్సహించడం ఈ చొరవ లక్ష్యమని పేర్కొంది.  గత సంవత్సరం, జనరల్ అథారిటీ ఆఫ్ కస్టమ్స్ (GAC) ఈద్ అల్ ఫితర్ వేడుకల సందర్భంగా అబూ సమ్రా ద్వారా ఖతార్‌లోకి ప్రవేశించే/నిష్క్రమించే 62,628 వాహనాలకు సేవలు అందించినట్లు ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com