కాక్‌పిట్‌లోకి స్నేహితురాలు.. ఎయిరిండియా పైలట్ పై విచారణ

- April 21, 2023 , by Maagulf
కాక్‌పిట్‌లోకి స్నేహితురాలు.. ఎయిరిండియా పైలట్ పై విచారణ

యూఏఈ: దుబాయ్‌ నుంచి ఢిల్లీకి వెళుతున్న ఎయిర్‌ ఇండియా విమాన పైలట్‌ కాక్‌పిట్‌లోకి తన స్నేహితురాలిని అనుమతించడంపై ఇండియన్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సమగ్ర విచారణకు ఆదేశించింది. ఈ అంశంపై డీజీసీఏ విచారణ జరుపుతోందని.. సంబంధిత వాస్తవాలను దర్యాప్తు బృందం పరిశీలిస్తుందని డీజీసీఏ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఫిబ్రవరి 27న ఈ సంఘటన జరిగిందని, ఇది ఏవియేషన్ రెగ్యులేటర్ చట్టం, DGCA భద్రతా నిబంధనలను ఉల్లంఘన కిందకు వస్తుందని సదరు అధికారి తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com