శాంతియుతంగా రంజాన్ వేడుకలు: సీపీ చౌహాన్
- April 21, 2023
హైదరాబాద్: రంజాన్ పండుగ సంధర్భంగా చేపట్టవలసిన భద్రతా ఏర్పాట్లు, మరియు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కమిషనర్ డి.ఎస్.చౌహాన్ రాచకొండ జోనల్ డీసీపీలు, ఏసిపిలు మరియు ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమన్వయ సమావేశం ఈరోజు Neradmet CP officeలో నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో సున్నితమైన ప్రదేశాలలో రంజాన్ వేడుకల సమయంలో ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజలు శాంతియుతంగా, సంతోషంగా రంజాన్ పండుగ జరుపుకోవాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులతో సహకరించాలని తెలిపారు.
ముస్లింలు భారీ సంఖ్యలో పాల్గొనే సామూహిక ప్రార్థనల వంటి కార్యక్రమాల బందోబస్తు సమయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
బందోబస్తు ఏర్పాట్లు చేసే సందర్భంలో తగిన సమర్థవంతమైన అధికారులకు విధులు అప్పగించాలని సూచించారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని, ఆయా ప్రాంతాల్లో సీసీటీవీల పనితీరును పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. ట్రాఫిక్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, సామూహిక ప్రార్థనల సమయంలో రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ లు ఏర్పడకుండా, ఇతర సాధారణ ప్రజలు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో మత సామరస్యం కాపాడడానికి అవసరమైన అన్ని రకాల చర్యలూ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
జాయింట్ కమిషనర్ సత్యనారాయణ, డిసిపి బాలస్వామి,ఏసిపి జావేద్, ఏసిపి జగదీష్ చందర్, ఏసిపిలు, ఇన్స్పెక్టర్లు మరియు ఇతర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







