విదేశీ కరెన్సీ..టీటీడీకి కేంద్ర ప్రభుత్వం ఊరట
- April 21, 2023
తిరుమల: టీటీడీకి (తిరుమల తిరుపతి దేవస్థానం) కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. శ్రీవారికి భక్తులు సమర్పించే ఫారిన్ కరెన్సీని బ్యాంకులో డిపాజిట్ చేసుకునేందుకు కేంద్రం అంగీకరించింది. ఫారిన్ కరెన్సీ సమర్పించిన దాతల వివరాలు లేకపోయినా బ్యాంకులో డిపాజిట్ చేసుకునేందుకు టీటీడీకి మినహయింపునిచ్చింది.
భక్తులు శ్రీవారికి సమర్పించిన కానుకలుగా వాటిని పేర్కొనాలని కేంద్రం కోరింది. సెక్షన్ 50 ప్రకారం టీటీడీకి మాత్రమే ఇలాంటి మినహాయింపు ఇస్తున్నట్లు టీటీడీకి సమాచారం ఇచ్చారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ముత్తుకుమార్.
గతంలో ఫారిన్ కరెన్సీ డిపాజిట్ల వ్యవహారంలో టీటీడీకి రూ.3కోట్ల జరిమానా విధించింది కేంద్రం. జరిమానా చెల్లించిన అనంతరం ఫారిన్ కరెన్సీ డిపాజిట్ చేసుకునేందుకు లైసెన్స్ రెన్యువల్ చేసింది కేంద్రం. లైసెన్స్ రెన్యువల్ చేసినా.. ఫారిన్ కరెన్సీ డిపాజిట్ చేసే సమయంలో దాతల వివరాలు తెలపాలన్న నిబంధనను మాత్రం కేంద్రం సడలించలేదు. తాజాగా టీటీడీ విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







