డీఎక్స్‌బీలో పిల్లల కోసం పాస్‌పోర్ట్ కంట్రోల్ కౌంటర్‌లు

- April 22, 2023 , by Maagulf
డీఎక్స్‌బీలో పిల్లల కోసం పాస్‌పోర్ట్ కంట్రోల్ కౌంటర్‌లు

దుబాయ్: పిల్లల కోసం కొత్త పాస్‌పోర్ట్ కంట్రోల్ కౌంటర్‌లను ప్రారంభించినట్లు దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (డీఎక్స్‌బీ) ప్రకటించింది. చిన్నారుల కోసం ప్రత్యేకంగా పాస్‌పోర్ట్ కంట్రోల్ లేన్‌లు, కౌంటర్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. నాలుగు నుండి 12 సంవత్సరాల వయస్సు గల పిల్లల కోసం తయారు చేయబడిన కొత్త పాస్‌పోర్ట్ నియంత్రణ ప్లాట్‌ఫారమ్‌లను ప్రారంభించినట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) తెలిపింది.

కొత్త కౌంటర్లు చిన్నారులను ఆకట్టుకునేలా డిజైన్‌ను కలిగి ఉంటాయని, DXB వద్ద టెర్మినల్ 3 ఎంట్రన్స్ హాల్‌లో ఏర్పాటు చేశామని  అథారిటీ వెల్లడించింది. ఇక్కడ పిల్లలు స్వంతంగా తమ పాస్‌పోర్ట్‌లను స్టాంప్ చేయించుకునే అవకాశాన్ని పొందుతారని పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com