IPL 2023: హైదరాబాద్ పై చెన్నై విజయం
- April 21, 2023
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 135 పరుగుల లక్ష్యాన్ని చెన్నై మూడు వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలో ఛేదించింది. చెన్నై బ్యాటర్లలో ఓపెనర్ డేవాన్ కాన్వే(77 నాటౌట్; 57 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకంతో ఆకట్టుకోగా రుతురాజ్ గైక్వాడ్(35; 30 బంతుల్లో 2 ఫోర్లు) రాణించాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో మయాంక్ మార్కండే రెండు వికెట్లు తీశాడు.
అంతక ముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. ఓపెనర్లు హ్యారీ బ్యూక్(18; 13బంతుల్లో 3ఫోర్లు), అభిషేక్ శర్మ(34; 26 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్)లు తొలి వికెట్‌కు 4.2 ఓవర్లలోనే 35 పరుగులు జోడించి శుభారంభం అందించారు. దూకుడుగా ఆడే క్రమంలో ఆకాశ్ సింగ్ బౌలింగ్‌లో బ్రూక్ పెవిలియన్‌కు చేరుకున్నాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రాహుల్ త్రిపాఠి(21; 21 బంతుల్లో 1 సిక్స్, 1ఫోర్)తో కలిసి అభిషేక్ దూకుడుగా ఆడడంతో 9 ఓవర్లకు సన్‌రైజర్స్ స్కోరు 70/1కి చేరింది.
కాగా.. రవీంద్ర జడేజా సన్‌రైజర్స్‌ను గట్టి దెబ్బకొట్టాడు. వరుస ఓవర్లలో అభిషేక్ శర్మతో పాటు రాహుల్ త్రిపాఠిలకు ఔట్ చేశాడు. మార్క్రమ్(12) సైతం ఎక్కువ సేపు క్రీజులో నిలవకపోవడం, ఎన్నో ఆశలు పెట్టుకున్న మయాంక్ అగర్వాల్(2) విఫలం కావడంతో 95 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి సన్‌రైజర్స్ కష్టాల్లో పడింది. ఈ దశలో హెన్రిచ్ క్లాసెన్(17), మార్కో జాన్సెన్(17నాటౌట్)తో కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే.. పతిరాన బౌలింగ్‌లో క్లాసెన్ ఔట్ కావడం కావడంతో సన్‌రైజర్స్ ఓ మోస్తారు స్కోరుకే పరిమితమైంది. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీయగా ఆకాశ్ సింగ్, మహేశ్ తీక్షణ, పతిరాన తలా ఓ వికెట్ పడగొట్టారు.
తాజా వార్తలు
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స







