ఈద్ అల్-ఫితర్: ఆకాశాన్నంటిన విమాన టికెట్ ధరలు..!
- April 22, 2023
కువైట్: ఈద్ అల్-ఫితర్ సందర్భంగా విమానయాన టిక్కెట్ల ధరలు ఆకాశాన్నంటాయి. అయినా పౌరులు, నివాసితులు ఈద్ సెలవులను విదేశాలలో గడపడానికి ఆసక్తి చూపుతున్నారు. గత కొన్ని రోజులుగా చాలా మంది వ్యక్తులు టిక్కెట్లు బుక్ చేసుకున్నారని, సెలవుల సమయంలో టిక్కెట్ ధరలు 300 శాతం కంటే ఎక్కువగా పెరిగాయని ట్రావెల్ ఏజెంట్లు తెలిపారు. కువైట్ నుంచి దుబాయ్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, టర్కీ, ఖతార్, యూకే, ఇతర యూరోపియన్ దేశాలకు ఎక్కువగా వెళుతున్నారని పేర్కొన్నారు.
“ప్రయాణికులు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాలు, టర్కీ, ఈజిప్ట్, లెబనాన్, అజర్‌బైజాన్, జార్జియా వంటి కువైట్‌కు దగ్గరగా ఉన్న దేశాలకు వెళ్లడానికి ఇష్టపడుతున్నారు. ఒక టిక్కెట్టు సగటు ధర KD 200గా ఉంది.” అని ఇబ్రహీం రాఫత్ అనే ట్రావెల్ ఏజెంట్ చెప్పాడు. దుబాయ్‌కి సగటు ధర KD 280, జెడ్డాకు KD 220, ఇస్తాంబుల్‌కి KD 350, కైరోకు KD 300, చాలా మంది ప్రయాణికులు లండన్, జెనీవా, స్పెయిన్ వంటి యూరోపియన్ దేశాలకు వెళ్లారని ఇబ్రహీం రాఫత్ అనే ట్రావెల్ ఏజెంట్ పేర్కొన్నారు. “ఈద్ సందర్భంగా చాలా మంది ప్రజలు లండన్, కైరో, దుబాయ్‌లకు వెళ్లారు. ఇటీవలి భూకంపం తర్వాత ఇస్తాంబుల్‌కు డిమాండ్ తగ్గింది. ఈ సెలవు సమయంలో ఎయిర్‌లైన్ టిక్కెట్ ధరలు 300 శాతం కంటే ఎక్కువ పెరిగాయి (కొన్ని గమ్యస్థానాలకు). కొన్ని వారాల క్రితం KD 190తో పోలిస్తే, లండన్‌కు టిక్కెట్ ధర సుమారు KD 690. అలాగే, పండుగ సీజన్‌కు ముందు KD 50 నుండి KD 70తో పోలిస్తే, కైరోకి టికెట్ KD 270కి చేరుకుంది. సమీపంలోని ఇతర గమ్యస్థానాలకు (GCC లోపల) KD 200కి చేరుకుంది" అని అద్నాన్ హమాది అనే ట్రావెల్ ఏజెంట్ తెలిపారు. సౌదీ ప్రభుత్వం విదేశీయుల కోసం ఆన్‌లైన్ టూరిస్ట్ వీసాను ప్రారంభించిన తర్వాత ఎక్కువ మంది పర్యాటకులు కువైట్ నుండి జెడ్డాకు ప్రయాణించారని చెప్పారు.
తాజా వార్తలు
- భక్తులకు TTD కీలక అలర్ట్..
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి
- రామ్ చరణ్ బర్త్‌డేకు అర్థవంతమైన కానుక ఇచ్చిన చిరంజీవి
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!









