యూఏఈ స్కామ్ అలెర్ట్: అసలివి పోలిన నకిలీ ఉద్యోగ ఆఫర్‌లు

- April 23, 2023 , by Maagulf
యూఏఈ స్కామ్ అలెర్ట్: అసలివి పోలిన నకిలీ ఉద్యోగ ఆఫర్‌లు

యూఏఈ: ఇండస్ట్రీ ప్రమాణాల కంటే ఎక్కువ జీతాలు, ప్రోత్సాహకాలతో ఉద్యోగ ఆశావహులకు నకిలీ ఉద్యోగ ఆఫర్‌లు అందిస్తున్నారని అబుధాబికి చెందిన ఆసుపత్రులు హెచ్చరించాయి. ముస్సాఫా పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న మిలీనియం, ఫీనిక్స్ ఆసుపత్రుల పేరుతో నకిలీ జాబ్ ఆఫర్లు వచ్చినట్లు ఉద్యోగార్ధుల నుండి ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. స్కామర్లు, బోగస్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల బారిన పడవద్దని ఆసుపత్రుల అధికారులు ప్రజలు, నివాసితులను కోరారు. "జాబ్ ఫ్రాడర్స్ ఆసుపత్రుల లోగోలను ఉపయోగించారు. ఉద్యోగార్ధులకు ఉద్యోగ ఆఫర్లు, అపాయింట్‌మెంట్ లెటర్‌లు పంపారు. HR మేనేజర్ నుండి పంపినట్లు చూపి తప్పుదారి పట్టించారు. డాక్యుమెంట్‌కి ఇమెయిల్ ID, వెబ్‌సైట్ అధికారిక వాటితో సమానంగా ఉంటుంది. ” అరి V.R. మిలీనియం హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. ఉదాహరణకు.. అధికారిక వెబ్‌సైట్ www.phoenixhospital.ae అయితే అపాయింట్‌మెంట్ లెటర్‌లోని నకిలీది www.phoenixhospitalae.com అని ఉంటుందని వివరించారు. సాధారణంగా ఉద్యోగార్థులను అకర్షించేందుకు స్కామర్లు.. అత్యధిక జీతాలను ఆఫర్ చేస్తారని చెప్పారు. అలాంటి ఉద్యోగ ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఆయా కంపెనీల హెచ్ ఆర్ విభాగాలను సంప్రదించి మాత్రమే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com