అమృత్ పాల్ సింగ్‌ను అరెస్టు చేసిన మోగా పోలీసులు
- April 23, 2023
పంజాబ్: ఖలిస్థానీ సానుభూతిపరుడు, 'వారిస్ పంజాబ్ దే' నాయకుడు అమృత్‌పాల్ సింగ్‌ను పంజాబ్‌లోని మోగా పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. అమృత్‌పాల్ సింగ్ కి అత్యంత సన్నిహితుడైన లవ్‌ప్రీత్ సింగ్ అలియాస్ తూఫాన్ సింగ్‌ను ఇటీవల పంజాబ్ పోలీసులు ఓ కిడ్నాప్ కేసులో అరెస్టు చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ అమృత్‌పాల్ పిలుపు మేరకు ... ఫిబ్రవరి 24న పెద్ద సంఖ్యలో యువత అమృత్‌సర్ జిల్లాలోని అజ్‌నాలా పోలీస్‌స్టేషన్ పై దాడికి తెగబడ్డారు. అల్లర్లు జరిగేలా యువతను రెచ్చగొట్టాడన్న ఆరోపణలపై అమృత్‌పాల్ పై కేసు నమోదైంది. అమృత్‌పాల్ సింగ్ మార్చి 18 నుంచి పరారీలో ఉన్నాడు. అప్పటి నుంచి అతడి ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల కోసం పంజాబ్ ప్రభుత్వం పోలీసులకు సెలవులనూ రద్దు చేసింది. ఎట్టకేలకు ఈరోజు అమృత్‌పాల్ సింగ్‌ను మోగా పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







