మరో నకిలీ వెబ్ సైట్ ను గుర్తించిన TTD
- April 23, 2023
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)కి నకిలీ వెబ్ సైట్ల బెడద పట్టుకుంది. తిరుమలలో మరో నకిలీ వెబ్ సైట్ పై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. నకిలీ వెబ్ సైట్ ను గుర్తించిన టీటీడీ ఐటీ విభాగం తిరుమల వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏపీ ఫోరెన్సిక్ సైబర్ సెల్ దీనిపై విచారణ చేస్తోంది. నకిలీ వెబ్ సైట్లను నమ్మవద్దని భక్తులకు టీటీడీ సూచించింది. ఇప్పటికే 40 నకిలీ వెబ్ సైట్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
తాజాగా కేసులో వెబ్ సైట్ల సంఖ్య 41కి చేరింది. టీటీడీ వెబ్ సైట్ ను పోలిన రీతిలోనే నకిలీ వెబ్ సైట్లను కోకొళ్లలుగా సృష్టించి మోసగాళ్లు భక్తులను సులభంగా మోసం చేస్తున్న వైనాన్ని టీటీడీ గుర్తించింది. ఇటీవలనే 40 నకిలీ వెబ్ సైట్లను గుర్తించి పోలీసులకు పిర్యాదు చేసింది. తాజాగా ఆదివారం మరో నకిలీ వెబ్ సైట్ ను టీటీడీ గుర్తించింది.
టీటీడీ ఐటీ విభాగం నకిలీ వెబ్ సైట్ ను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత కొంతకాలంగా భక్తులు పెద్ద ఎత్తున మోసపోతుండటంతో టీటీడీ నకిలీ వెబ్ సైట్లపై దృష్టి సారించింది. ఏదైతే టీటీడీ వెబ్ సైట్ ఉంటుందో అదే తరహాలో స్వల్ప మార్పులతో భక్తులను నమ్మించే విధంగా నకిలీ వెబ్ సైట్లను సృష్టించి భక్తుల నుంచి లక్షలాది రూపాయలను కొల్లగొడుతున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







