హూరా మస్జీదులో భారీ అగ్నిప్రమాదం..!
- April 23, 2023
బహ్రెయిన్: హూరా ప్రాంతంలోని ప్రముఖ మస్జీదుకు అనుబంధంగా ఉన్న వంటగదిలో భారీ అగ్నిప్రమాదం జరగింది. ఈ ప్రమాదంలో వ్యక్తి గాయపడినట్లు అధికారులు తెలిపారు. అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సివిల్ డిఫెన్స్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను ఆర్పివేశారు. కిచెన్ లో మొదలైన మంటలు చుట్టుపక్కలకు వ్యాపించినట్లు తెలుస్తోంది. ఎంతమేర నష్టం జరిగిందనేది ఇంకా తెలియరాలేదు. అగ్నిప్రమాదానికి వంటగదిలోని గ్యాస్ సిలిండర్ లీకేజీనే కారణమని ప్రాథమిక విచారణలో తేలిందని అంతర్గత మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







