కొలువుతీరిన సింగపూర్ తెలుగు సమాజం నూతన కార్యవర్గం
- April 23, 2023
సింగపూర్: సింగపూర్ తెలుగు సమాజం సర్వసభ్యసమావేశం-2022 సంబంధించి నూతన కార్యవర్గ ఎన్నికలు మార్చి 5, 2023 న 2023 -2025 గాను ఉత్కంఠభరితంగా , హోరాహోరీగా జురాంగ్ లో దేవన్ నాయర్ ఇస్టిట్యూట్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంప్లాయిబిలిటీ ప్రాంగణంలో జరిగాయి. ఇటీవలి కాలంలో నిర్వహించిన పలు విభిన్న కార్యక్రమాలు, భారీ స్ధాయిలో నిర్వహించిన వివిధ కార్యక్రమాలు, కోవిడ్ సమయంలో నిర్వహించిన అనేక సేవా కార్యక్రమాలు మొదలగున్నవి సింగపూర్లో నివశించే తెలుగువారితో పాటు , పలు సంస్ధలు, ప్రభుత్వ శాఖల దృష్టిని ఆకర్షించమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక సంస్ధల గుర్తింపు తో పాటు మార్గదర్శకంగా నిలిచాయి. దీనికి ప్రతిస్పందనగా సింగపూర్లో నివశించే తెలుగువారిలో సుమారు 8000 మంది సభ్యత్వం తీసుకొని ఉత్సాహంగా తమ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి ముందుకువచ్చారు. ఈక్రమంలోనే గరిష్ఠంగా ఈసారి నలుగురు ఔత్సాహికులు అధ్యక్షులుగా రంగంలోకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకొన్నారు. నామినేషన్స్ ఉపసంవరణ పక్రియ అనంతరం 51 మంది వివిధ కార్యవర్గ స్ధానాలకు సంబంధించి ఎన్నికలో నిలిచారు.
నవంబరు 6న జరిగిన సర్వసభ్యసమావేశం నిర్ణయం మేరకు డిశంబరు 31 తేదీలోపు బకాయిలు లేకుండా క్రియాశీలకంగా ఉన్న 8994
మందిని ఎన్నికలలో పాల్గొనగలిగిన సభ్యులుగా గుర్తించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలనే సత్సంకల్పంతో , సర్వసభ్యసమావేశం సూచన మేరకు , తెలుగు సమాజ వ్యవస్ధలో భాగంకాని మూడవపక్షానికి చెందిన తంగవేలు అన్బళగన్ ను ఎన్నికల ముఖ్య కార్యనిర్వహణాధికారిగా నియమించారు. సామాజిక, సాంస్కృతిక , ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడంలో విశేష అనుభవం, ఇంతకముందు 30,000 మంది వరకు పాల్గొన్న వివిధకార్యక్రమాల నిర్వహణ తంగవేలు అన్బళగన్ సొంతం. ఇవన్నీ ఈ ఎన్నికలను అత్యంత పారదర్శకంగా, సులభంగా , ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా, నిష్పక్షపాతంగా నిర్వహించగలగటంలో దోహదపడ్డాయి. ఆయన బృందం శక్తివంచన లేకుండా చక్కగా తమ భాద్యతను విజయవంతంగా నిర్వహించి అనేకమంది మన్ననలను పొందింది.
ఎన్నికలలో 4986 పాల్గొని తమ ఓటు హక్కుని వినియోగించుకొన్నారు. ఎన్నికలలో నిలబడిన వారి సమక్షంలో జరిగిన లెక్కింపు అనంతరం ఎన్నికలకు సంబంధించిన పూర్తి ఫలితాలు ఇటీవల ప్రకటించబడ్డాయి. దాని ప్రకారం సింగపూర్ తెలుగు సమాజం కార్యవర్గ ఎన్నికల్లో శ్రీ బొమ్మారెడ్డి శ్రీనివాసుల రెడ్డి నూతన అధ్యక్షుడుగా మరియు అతని బృందం చారిత్రాత్మకమైన విజయం సాధించింది.
సర్వసభ్య సమావేశం ఛైర్మన్ కోటిరెడ్డి విజేతలను ప్రకటించి వారికి శుభాకాంక్షలు తెలుయజేసారు. నూతన కార్యవర్గం ఏప్రిల్ 1 నుండి బాధ్యతలను స్వీకరించిందని అప్పటి గౌరవ కార్యదర్శి సత్య చిర్ల తెలిపారు. నూతన కార్యవర్గం వివరాలు ఈక్రింది విధంగా ఉన్నాయి.
అధ్యక్షులు-బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి
గౌరవ కార్యదర్శి - పోలిశెట్టి అనిల్ కుమార్
గౌరవ కోశాధికారి - బచ్చు ప్రసాద్
ఉపాధ్యక్షులు- కురిచేటి జ్యోతీశ్వర్ రెడ్డి, పాలెపు మల్లిక్, పుల్లన్నగారి శ్రీనివాస్ రెడ్డి, టేకూరి నగేష్
నిర్వహణ కార్యదర్శి-కురిచేటి స్వాతి
సహాయ కోశాధికారి-జూనెబోయిన అర్జునరావు
ప్రాంతీయ కార్యదర్శులు- బోయిని సమ్మయ్య, కలిదిండి ఫణీంద్ర వర్మ, మేరువ కాశి రెడ్డి, మ్రితివాడ రాంరెడ్డి
కమిటీ సభ్యులు-బద్దం జితేందర్ రెడ్డి,బాలగా రమణారావు,బండ్ర శేషగిరి,గాడిపల్లి చంద్రమౌళి,గుజ్జుల శ్రీలక్ష్మి,కొత్తా సుప్రియ,రాపేటి జనార్ధనరావు,స్వామి గోపి కిషోర్, వైద మహేష్,ఎఱ్ఱాప్రగడ చాణక్య
గౌరవ ఆడిటర్లు-ఆలపాటి వెంకట రాఘవ రావు,రొడ్డా సతీష్ బాబు
నూతన అధ్యక్షుడు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ అనాదిగా పూర్వకార్యవర్గాలు నిర్వహించిన కార్యక్రమాలను కొనసాగిస్తూ అందరినీ కలుపుకొని మరిన్ని వినూత్న కార్యక్రమాలు రూపొందిస్తూ సమాజాన్ని మరింత ప్రగతిపథంలోకి తీసుకొనివెళ్ళేట్లుగా శక్తివంచన లేకుండా కృషిచేస్తామని తెలిపారు.
నూతన కార్యవర్గం మొదటి కార్యవర్గ సమావేశం 21 ఏప్రిల్ న జరిగిందని , మొదటి కార్యక్రమంగా మే 1న అంతర్జాతీయ కార్మిక దినోత్సవం నిర్వహిస్తున్నామని నూతన గౌరవ కార్యదర్శి అనిల్ పోలిశెట్టి ఒక ప్రకటనలో తెలిపారు.
_1682266959.jpg)
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







