ప్రపంచ బ్యాంక్ LPI 2023లో 17 ర్యాంక్‌లు ఎగబాకిన సౌదీ అరేబియా
- April 24, 2023
రియాద్: ప్రపంచ బ్యాంక్ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ (LPI) 2023లో సౌదీ అరేబియా 17 ర్యాంక్‌లు ఎగబాకినట్లు రవాణా, లాజిస్టిక్ సేవల మంత్రి ఇంజినీర్ సలేహ్ బిన్ నాసర్ అల్-జాసర్ ప్రకటించారు. క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ మద్దతు, సాధికారతలో ఈ ఘనత సాధ్యమైనట్లు అల్-జాసర్ అన్నారు. రవాణా, లాజిస్టిక్స్ సేవల కోసం జాతీయ వ్యూహానికి అనుగుణంగా.. గ్లోబల్ లాజిస్టిక్ హబ్‌గా సౌదీ స్థానాన్ని ఏకీకృతం చేయడానికి సౌదీ అరేబియా నాయకత్వం ఆదేశాల ద్వారా ఈ వ్యవస్థ కొనసాగుతుందని ఆయన తెలిపారు. రవాణా, లాజిస్టిక్ సేవల కోసం జాతీయ వ్యూహాన్ని ప్రారంభించినప్పటి నుండి 2 సంవత్సరాలలోపు సౌదీ అరేబియా సూచికలో 17 ర్యాంక్‌ల పురోగతి సాధించిందని పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంక్ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ (LPI) 2023లో 155 దేశాల లాజిస్టికల్ సామర్థ్యాల డేటా ఆధారంగా ర్యాంకులను కేటాయించారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







